Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Babar Azam: ఇదే కెప్టెన్ నెంబర్ వన్ ర్యాంక్ ఇవ్వలేదా?.. బాబర్‌కు అండగా టీమిండియా లెజెండ్!

World Cup 2023: వరల్డ్ కప్‌లో పేలవ ప్రదర్శన చేసిన పాకిస్తాన్ టీం విమర్శలపాలవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆ టీం కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను పలువురు మాజీలు కూడా తిట్టిపోస్తున్నారు. అతన్ని వెంటనే కెప్టెన్‌గా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. బాబర్‌కు కెప్టెన్సీ ఏమాత్రం చేతకాదని, అతనికి వ్యూహాలు వేయడం రాదని చాలామంది తిడుతున్నారు.

ఈ వరల్డ్ కప్‌ను వరుసగా రెండు విజయాలతో ప్రారంభించిన పాకిస్తాన్.. ఆ తర్వాత చతికిలపడింది. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటమి చవిచూసింది. దీంతో ఐదో స్థానంలో టోర్నీని ముగించిన పాక్ జట్టు.. ఇటీవలే స్వదేశానికి వెళ్లింది. ఇక సుమారు ఏడాదిపాటు పాకిస్తాన్ వన్డేలకు దూరంగానే ఉండనుంది. ఈ క్రమంలోనే బాబర్‌ను జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

World Cup 2023 Kapil Dev backs Babar Azam amid his sacking demands

అతని స్థానంలో షహీన్ అఫ్రిదీ, లేదా మహమ్మద్ రిజ్వాన్‌కు జట్టు పగ్గాలు అందించాలని కొందరు సలహాలు ఇస్తున్నారు. ఈ కామెంట్స్‌పై టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ అసహనం వ్యక్తం చేశాడు. కొన్నిరోజుల క్రితం పాకిస్తాన్ జట్టు వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంకు సాధించడంలో బాబర్ కీలక పాత్ర పోషించాడని, ఆ విషయం మర్చిపోకూడదని కపిల్ అన్నాడు.

'ఇవాళ అందరూ కూడా బాబర్ సరిగా ఆడటం లేదు అంటారు. ఎందుకంటే మీరు జస్ట్ ప్రస్తుతం జరుగుతున్నదే చూస్తున్నారు. కానీ ఇదే కెప్టెన్ ఒక ఆర్నెల్ల క్రితం ఈ జట్టును వన్డేల్లో టాప్ ర్యాంకుకు తీసుకెళ్లాడు. ఎవరైనా జీరోకే అవుటైపోతే.. 99 శాతం మంది చూసేవాళ్లు అతన్ని జట్టులో నుంచి తీసేయాలనే చెప్తారు. అదే సమయంలో ఎవరైనా సాధారణ ప్లేయర్ సెంచరీ చేస్తే అతనికి అవకాశం ఇవ్వాలనడం సహజమే' అని కపిల్ వివరించాడు.

World Cup 2023 Kapil Dev backs Babar Azam amid his sacking demands

'ఆ ఆర్డినరీ ప్లేయరే తర్వాతి సూపర్ స్టార్ అని జనాలు అంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ప్రస్తుత పెర్ఫామెన్స్ ఒక్కటే చూడకూడదు. అతను ఆటను ఎలా అప్రోచ్ అయ్యాడు? కఠినమైన పరిస్థితుల్లో ఎలా ఆడతాడు? అనే విషయాలను బట్టి ఆ ఆటగాడి విలువను అంచనా వేయాలి. అంతేకానీ, ఒకటి రెండు తక్కువ స్కోర్లు చూసి కాదు' అని కపిల్ పేర్కొన్నాడు.

Story first published: Tuesday, November 14, 2023, 16:55 [IST]
Other articles published on Nov 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+