హైదరాబాద్‌లో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ మ్యాచులో న్యూజిల్యాండ్ జట్టు టాస్ ఓడింది. రెండేళ్ల క్రితం వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచులో కూడా ఆడటం లేదు. ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభ మ్యాచులో గాయపడిన విలియమ్సన్.. నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో జరిగిన వరల్డ్ కప్ ఓపెనింగ్ మ్యాచులో కూడా విలియమ్సన్ ఆడలేదు.
ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతున్న మ్యాచులో కూడా కేన్ మామ ఆడటం లేదని తెలిసిన ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. ఇక్కడి పిచ్ బ్యాటింగ్‌కు బాగా సహకారం అందిస్తుందనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టు మంచి స్కోరు చేసే అవకాశం ఉంది.

టాస్ గెలిచి ఉంటే తాను కూడా ముందుగా బౌలింగ్ తీసుకునే వాడినని కివీస్ తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ అన్నాడు. స్టార్ పేసర్ లోకీ ఫెర్గూసన్ ఈ మ్యాచులో ఆడుతున్నట్లు చెప్పాడు. అతను ఇంగ్లండ్‌తో జరిగిన వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఇక అంతకుమించి పెద్దగా జట్టులో మార్పులు లేవన్నాడు.
కేన్ మామను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ నిరాశ చెందినా.. రచిన్ రవీంద్ర ఆటను చూసేందుకు ప్రేక్షకులు చాలా ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ ఓపెనింగ్ గేమ్‌లో అతను అద్భుతమైన సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.
నెదర్లాండ్స్ టీం: విక్రమ్ జీత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కోలిన్ ఆకర్‌మన్, బాస్ డీ లీడ్, తేజ నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), సైబ్రాండ్ ఎంగెల్‌బబ్రెట్, రోలాఫ్ వాన్ డర్ మెర్వ్, ర్యాన్ క్లెయిన్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకరన్
న్యూజిల్యాండ్ టీం: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారియల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ శాంట్నర్, మాట్ హెన్రీ, లోకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.