For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Cup 2023: ఆడిన ఫస్ట్ మ్యాచులోనే.. కేన్ మామకు గాయం.. మళ్లీ ఆడతాడా? లేదా?

ఈ వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్ ఆడిన కేన్ మామకు ఈ మ్యాచులోనే దెబ్బ తగిలింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన అతను.. ఆట మధ్యలోనే రిటైర్డ్ అవుట్‌గా వెనుతిరగాల్సి వచ్చింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచులో కివీస్ కెప్టెన్ ఆచితూచి ఆడుతూ పూర్వపు టచ్ పొందేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. కివీస్ ముందు 246 పరుగుల టార్గెట్ నిలిపింది. దీన్ని ఛేజ్ చేసే క్రమంలో కేన్ విలియమ్సన్ (78) చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. ఈ వరల్డ్ కప్‌లో కేన్‌ ఆడిన తొలి మ్యాచ్ ఇదే కావడంతో ఫ్యాన్స్ అంతా సంతోషించారు. అతను మంచి టచ్‌లో కనిపిస్తున్నాడని, ఇలాగైతే జట్టు బ్యాటింగ్ మరింత బలంగా మారుతుందని ఆశించారు. సెంచరీ కూడా పూర్తి చేసుకుంటాడని అనుకున్నారు.

World Cup 2023 Kane Williamson injured in his first CWC 2023 game against Bangladesh

అయిటే 39వ ఓవర్లో జరిగిన ఒక ఘటన వల్ల కేన్ మామ రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరగాల్సి వచ్చింది. ఈ ఓవర్లో పరుగు తీయడానికి కేన్ మామ వెళ్లినప్పుడు.. మిడాాఫ్‌లో ఉన్న ఫీల్డర్ అతన్ని రనౌట్ చేసేందుకు ప్రయత్నించాడు. అది వికెట్లకు తగలాల్సిందిపోయి, కేన్ మామ చేతికి బలంగా తగిలింది. ఈ నొప్పి తట్టుకోలేక పోయిన అతను విలవిల్లాడాడు. కొంత ట్రీట్‌మెంట్ తీసుకొని ఆట కొనసాగించేందుకు కేన్ ప్రయత్నించాడు.

కానీ చివరకు ఆ నొప్పి భరించలేకపోయాడు. దీంతో వ్యక్తిగత స్కోరు 78 పరుగుల వద్దనే రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగాడు. అప్పటికే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న డారియల్ మిచెల్ (89 నాటౌట్) మిగతా లాంఛనం పూర్తి చేయడంతో ఈ మ్యాచులో కివీస్ ఘనవిజయం సాధించింది. అయితే కివీస్ ఆడే తర్వాతి మ్యాచులో కేన్ మామ ఆడతాడా? లేదా? అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

Story first published: Saturday, October 14, 2023, 8:32 [IST]
Other articles published on Oct 14, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+