భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రీడాలోకం అంతా ఎదురు చూస్తోంది. ఫ్ాయన్స్ అందరూ శనివారం ఎప్పుడొస్తుందా? అన అందరూ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో మీడియాతో మాట్లాడిన టీమిండియా స్టార్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా తను ఈ మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు.
అక్టోబర్ 14న ఈ హైఇంటెన్సిటీ మ్యాచ్ జరుగుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే రెండు టీమ్స్ తమ ప్రిపరేషన్‌ను మరింత ముమ్మరం చేశాయి. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని రెండు జట్లు తహతహలాడుతున్నాయి. ఈ క్రమంలోనే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన మనసులో ఏముందో చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచులో భారత్ గెలవాలంటే బుమ్రా రాణించడం కూడా చాలా ముఖ్యం. గాయం నుంచి కోలుకున్న తర్వాత బుమ్రా అద్భుతమైన ప్రదర్శనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో కూడా అతను తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే భారత విజయావకాశాలు చాాలా మెండుగా ఉంటాయి. ఈ క్రమంలోనే తను కూడా మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నట్లు బుమ్రా చెప్పాడు.
ఆఫ్ఘనిస్తాన్‌పై అద్భుతంగా రాణించిన బుమ్రా.. పాక్‌పై కూడా అదే స్థాయిలో రాణించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో తను ఎలా ప్రిపేర్ అవుతుందీ బుమ్రా వివరించాడు. తను కేవలం ప్రిపరేషన్‌పై ఫోకస్ పెట్టానని, మిగతా విషయాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పాడు. అలాగే ఈ మ్యాచ్ కోసం తను చాలా ఎగ్జయిట్ అవుతున్నట్లు చెప్పుకొచ్చాడు.
గతేడాది వెన్నునొప్పితో జట్టుకు దూరమైన అతను.. గతేడాది ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ కూడా మిస్సయ్యాడు. ఆ తర్వాత ఐర్లాండ్‌తో టీ20 సిరీసులో రీఎంట్రీ ఇచ్చిన అతను అప్పటి నుంచి చక్కగా లాభం రాణిస్తూ.. జట్టుకు అతను తన ప్రదర్శనతో జట్టుకు మంచి విజయాలు అందిస్తున్న సంగతి తెలిసిందే.