Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: ఈ పాక్ స్టార్‌కు వరల్డ్ కప్ మరీ స్పెషల్.. కోహ్లీ ఆటోగ్రాఫ్ అడుగుతాడేమో?

దేశం తరఫున వన్డే వరల్డ్ కప్ నెగ్గాలని క్రికెటర్లు అందరికీ ఉంటుంది. కానీ కొన్నిసార్లు దీనికి యాడెడ్ బోనస్‌లా మరింత మేలు జరుగుతుంది. పాకిస్తాన్ స్టార్ పేసర్ హసన్ అలీ విషయంలో అదే జరుగుతోంది. ఈ వరల్డ్ కప్ అతనితోపాటు, అలీ భార్య సామియాకు కూడా చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ మెగాటోర్నీ వల్ల హసన్ అలీ భార్య.. తన కుటుంబాన్ని కలిసే అవకాశం ఉంది.

హసన్ అలీ 2019లో సామియా అర్జూను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ సంతోషంగా గడిపారు. ఇక 2021లో ఈ జంటకు ఓ అమ్మాయి పుట్టింది. కానీ హసన్ అలీ సామియా.. మాత్రం తమ కుటుంబానికి మంచి అవకాశం వచ్చిందని అనుకుంది. పెళ్లి జరిగినప్పటి నుంచి పాకిస్తాన్ నుంచి భారత్ రాలేక ఇబ్బబందిపడుతూ వచ్చింది. కానీ ఇన్నేళ్ల తర్వాత తన కుటుంబాన్ని చూడాలనే సీమ కోరక తీరనుంది.

 World Cup 2023 is something special for Pak pacer Hasan Ali

సామియా కుమార్తె హెలెనా.. మొట్ట మొదటగా తన తాతయ్యను భారత్, పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా కలవనుంది. మనుమరాలిని ఎత్తుకోవడానికి తాను చాలా కాలంగా ఎదురు చూస్తున్నానని, ఇప్పటికి ఆ కల నెరవేరబోతోందని లియాకత్ ఖాన్ అంటున్నాడు. తను గర్భవతి అని తెలిసిన గతంలో అంటే 2021లో ఒకసారి సామియా.. తన కుటుంబాన్ని కలిసింది.

ఈ క్రమంలో సామియా, హెలెనా ఇద్దరూ భారత్‌కు రావడం, ఇక్కడి తన కుటుంబాన్ని కలుసుకోవడం సానియాకు కచ్చితంగా స్వీట్ మెమరీస్‌లా మిగిలిపోతాయి. సీమా తండ్రి లియాకత్ ఖాన్ తదితరులంతా కూడా హసన్ అలీని టీంలోకి తీసుకున్నందుకు తెగ సంతోషిస్తున్నారు. ఆసియా కప్‌లో నసీం షా గాయపడటంతో అతని రిప్లేస్‌మెంట్‌గా హసన్ అలీని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

తనకు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం అని చెప్పిన లియాకత్.. విరాట్ ఆటోగ్రాఫ్ తీసుకోవడంలో తనకు హసన్ అలీ సాయం చేస్తే బాగుంటుందని అన్నాడు. పాకిస్తాన్ టీంకు వీసాలు లభించినప్పుడు కూడా తాము చాలా సంతోషించినట్లు లియాకత్ చెప్పుకొచ్చాడు. మరి మామగారి కోసం హసన్ అలీ వెళ్లి కోహ్లీ ఆటోగ్రాఫ్ అడుగుతాడేమో చూడాలి.

Story first published: Tuesday, October 3, 2023, 14:40 [IST]
Other articles published on Oct 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+