Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsSL: శ్రీలంకతో కీలక పోరుకు టీమిండియా రెడీ.. ఎవరు గెలుస్తారని హిస్టరీ చెప్తోంది?

World Cup 2023: వరల్డ్ కప్‌లో కీలక పోరుకు భారత జట్టు రెడీ అవుతోంది. వాంఖడే వేదికగా జరగనున్న ఈ మ్యాచులో శ్రీలంకను ఎదుర్కోనుంది. ఈ మ్యాచులో కనుక భారత్ గెలిస్తే సెమీస్ బెర్తు ఖాయమవుతుంది. దీంతో అందరూ ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఆసియా కప్ ఫైనల్‌లో ఘోర పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని శ్రీలంక భావిస్తోంది.

ఈ క్రమంలోనే అసలు వన్డే ఫార్మాట్‌లో ఈ రెండు జట్ల హిస్టరీ ఎలా ఉందని అంతా చూస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్‌లో వరుసగా ఆరు విజయాలతో టీమిండియా జోరు మీద ఉంది. అదే సమయంలో ఆరు మ్యాచుల్లో కేవలం రెండు విజయాలే సాధించిన శ్రీలంక ఏడో స్థానంలో ఉంది. ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ చేతిలో కూడా శ్రీలంక పరాభవం ఎదుర్కొంది.

World Cup 2023 INDvsSL Who will win according to head to head history

ఇక భారత్, శ్రీలంక రెండు జట్లు క్రికెట్ చరిత్రలో 167 వన్డేల్లో తలపడ్డాయి. వీటిలో 98 సార్లు విజయం టీమిండియానే వరించింది. శ్రీలంక 57 మ్యాచుల్లో గెలుపు సాధించింది. అంటే ఓవరాల్‌గా చూసుకుంటే శ్రీలంకపై భారత్‌దే పైచేయి అన్నమాట. అయితే ఆసియా కప్, వరల్డ్ కప్ వంటి టోర్నీల్లో శ్రీలంక ఆటతీరు అనూహ్యంగా మెరుగవడం అందరికీ తెలిసిందే.

అందుకే వరల్డ్ కప్‌లో భారత్, శ్రీలంక వైరం చాలా కాంపిటీటివ్‌గా కనిపిస్తోంది. ఈ రెండు జట్లు వరల్డ్ కప్‌లో భాగంగా 9 సార్లు తలపడ్డాయి. వీటిలో నాలుగు సార్లు భారత్ గెలుపొందగా.. నాలుగు సార్లు లంకేయులు జయభేరి మోగించారు. 1992 వరల్డ్ కప్‌లో జరిగిన ఒక్క మ్యాచులో మాత్రం ఫలితం రాలేదు. అంటే వరల్డ్ కప్‌లో ఈ రెండు టీమ్స్ సమవుజ్జీలు అనే చెప్పాలి.

ఇక చివరగా ఈ రెండు జట్లు 2019 వరల్డ్ కప్‌లో తలపడగా.. ఆ మ్యాచులో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం నమోదు చేసింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి ఐదు మ్యాచుల్లో భారతే పైచేయి సాధించడం గమనార్హం. ఆసియా కప్‌లో భాగంగా జరిగిన రెండు మ్యాచుల్లో శ్రీలంకను ఓడించిన భారత్.. అంతకుముందు జనవరిలో స్వదేశంలో జరిగిన మూడు వన్డేల సిరీసును క్లీన్ స్వీప్ చేసింది. కాబట్టి ఈ మ్యాచులో కూడా భారత్ నెగ్గడానికే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Story first published: Thursday, November 2, 2023, 9:10 [IST]
Other articles published on Nov 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+