Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsSL: విజయాలతో కళ్లు మూసుకుపోకూడదు.. మా ప్రయత్నం అదే: రోహిత్ శర్మ

భారత్‌తో కీలక పోరుకు శ్రీలంక రెడీ అయింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచులో శ్రీలంక సారధి కుశాల్ మెండిస్ టాస్ గెలిచాడు. బ్యాటింగ్‌కు స్వర్గధామంగా చెప్పుకునే వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇక్కడ ఎక్కువగా ఛేజింగ్ టీమ్స్ విజయాలు నమోదు చేయడం గమనార్హం.

రెండో ఇన్నింగ్సులో మంచు ప్రభావం కూడా ఉండే అవకాశం ఉండటంతో తాము ముందుగా బౌలింగ్ చేస్తామని మెండిస్ చెప్పాడు. అలాగే తమ జట్టులో ఒకే ఒక్క మార్పు చేశామని వెల్లడించాడు. ధనంజయ డి సిల్వ ఈ మ్యాచ్ ఆడటం లేదని, అతని స్థానంలో దుషాన్ హేమంతను ఆడిస్తున్నట్లు తెలిపాడు.

World Cup 2023 INDvsSL Rohit sharma makes key comments before the match

'ఇక్కడ సెకండ్ బ్యాటింగ్ చేయడమే బెటర్ అని అనుకుంటున్నా. మా ఆటగాళ్లు చక్కగా ఆడుతున్నారు. వాళ్ల సామర్ధ్యానికి తగ్గ ప్రదర్శన ఇస్తున్నారు. ఇక మాకు మిగిలిన మూడు మ్యాచులూ కీలకమే' అని కుశాల్ మెండిస్ అన్నాడు. ఈ మూడింట్లో ఏది ఓడినా శ్రీలంక సెమీస్ ఆశలు బాగా దెబ్బతింటాయి.

'నేను టాస్ గెలిచి ఉంటే ముందుగా బ్యాటింగే తీసుకునే వాడిని. పిచ్ చాలా బాగుంది. ఇన్నింగ్స్ ఆరంభంలో బౌలర్లకు కొంత సహకారం లభిస్తుంది. నేను చిన్నతనం నుంచి ఆడుతూ వచ్చిన చోట.. వరల్డ్ కప్‌లో టీమిండియా కెప్టెన్‌గా నిలబడటం చాలా గొప్ప గౌరవంగా ఫీలవుతున్నా' అని రోహిత్ చెప్పాడు.

ఒక జట్టుగా అన్ని విషయాల్లో మెరుగవడానికే తాము ప్రయత్నిస్తున్నట్లు రోహిత్ తెలిపాడు. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలో సీమర్లకు కొంత సహకారం ఉంటుందని అనుకుంటున్నట్లు చెప్పాడు. వరుస విజయాలతో కళ్లు మూసుకుపోకూడదని, అలాగే జట్టులో బ్యాలెన్స్ చాలా ముఖ్యమని వెల్లడించాడు.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహమ్మ్ సిరాజ్

శ్రీలంక టీం: పాథుమ్ నిస్సంక, దిముత్ కరుణరత్నే, కుశాల్ మెండిస్ (కెప్టెన్), సదీర సమరవిక్రమ, చరిత్ ఆసలంక, ఏంజెలో మాథ్యూస్, దుషాన్ హేమంత, మహీష తీక్షణ, కాసున్ రజిత, దుష్మంత చమీర, దిల్షాన్ ముధుశంక

Story first published: Thursday, November 2, 2023, 14:13 [IST]
Other articles published on Nov 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+