Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsSL: పాండ్యా గాయంపై కీలక అప్‌డేట్ ఇచ్చిన కెప్టెన్ రోహిత్!

Hardik Pandya: గాయంతో జట్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక అప్‌డేట్ ఇచ్చాడు. ఈ వరల్డ్ కప్ ఆరంభమైనప్పటి నుంచి పాండ్యా రాణిస్తున్నాడు. ముఖ్యంగా కొత్త బంతితో బుమ్రా, సిరాజ్‌కు చక్కని సహకారం అందిస్తున్నాడు. ఆసీస్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తా‌తో మ్యాచుల్లో రాణించాడు.

అయితే ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో లిటాన్ దాస్ బాదిన స్ట్రెయిట్ డ్రైవ్‌ను కాలితో ఆపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయిన అతను.. మడమ బెణకడంతో మైదానం వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత న్యూజిల్యాండ్, ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులకు అతను దూరమయ్యాడు.

World Cup 2023 INDvsSL Rohit gives key update on Hardik Pandya injury

ఇప్పుడు శ్రీలంకను ఢీకొట్టేందుకు భారత జట్టు రెడీ అవుతోంది. ఈ క్రమంలో అతని పరిస్థితి గురించి కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. ప్రెస్ మీట్‌లో పాండ్యా గురించి ఎదురైన ప్రశ్నలకు రోహిత్ సమాధానం ఇచ్చాడు. 'పాండ్యా పరిస్థితి చాలా పాజిటివ్‌గా ఉంది. దాన్ని రీహాబ్ అని చెప్పలేను కానీ.. గాయం తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకున్నాం' అని తెలిపాడు.

'పాండ్యా, ఎన్సీయే సిబ్బంది ఈ గాయం విషయంలో చక్కని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే చాలా పాజిటివ్ విషయాలు మాత్రం జరుగుతున్నాయి' అని రోహిత్ చెప్పాడు. అదే సమయంలో శ్రీలంకతో జరిగే మ్యాచులో కూడా పాండ్యా ఆడటం లేదని హిట్‌మ్యాన్ ప్రకటించాడు. అయితే పాండ్యా పరిస్థితి ఎలా ఉందని ప్రతి రోజూ ఆరా తీస్తూనే ఉన్నామన్నాడు.

'ఈ మ్యాచ్‌కు కూడా పాండ్యా అందుబాటులో లేడు. తను ఎంత వరకు కోలుకున్నాడు? ఎంత బౌలింగ్ చేస్తున్నాడు? బ్యాటింగ్ ఏ మాత్రం చేస్తున్నాడు? వంటి విషయాలన్నీ ప్రతి రోజూ తెలుసుకుంటూనే ఉన్నాం. ఇవన్నీ పరిశీలించిన తర్వాతనే పాండ్యా విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాం. అయితే అతను కోలుకుంటున్న విధానం చూస్తే.. త్వరలోనే రీఎంట్రీ ఇస్తాడని అనుకుంటున్నాం' అని పేర్కొన్నాడు.

Story first published: Thursday, November 2, 2023, 9:53 [IST]
Other articles published on Nov 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+