Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: షమీ బౌలింగ్‌ను ఒక్క మాటలో తేల్చేసిన లెజెండ్!

శ్రీలంకపై ఘన విజయం సాధించిన టీమిండియా.. వరల్డ్ కప్‌లో సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఈ విజయంలో వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ కీలకపాత్ర పోషించాడు. కేవలం లంకపైనే కాదు.. ఇంగ్లండ్, న్యూజిల్యాండ్ జట్లపై విజయాల్లో కూడా షమీదే కీలక పాత్ర. ఈ వరల్డ్ కప్‌లో కేవలం మూడు మ్యాచులే ఆడిన అతను.. భారత్ తరఫున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.

ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 14 వికెట్లు తీసుకున్న అతను.. లంకపై ఐదు వికెట్లతో వన్డే వరల్డ్ కప్ హిస్టరీలోనే భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలోనే షమీ బౌలింగ్‌ను ఆసీస్ లెజెండ్ మాథ్యూ హేడెన్ తెగ మెచ్చుకున్నాడు. షమీ ఇంత మంచి ఫామ్‌లో ఉండటంతో ప్రత్యర్థులకు ఏడుపు తప్ప ఏమీ మిగల్లేదని తేల్చిచెప్పాడు.

World Cup 2023 INDvsSL Matthew Hayden gives one word reply on Mohammed Shami bowling

'షమీ ఈ టీంలోకి తిరిగొచ్చినప్పటి నుంచి ప్రత్యర్థి బ్యాటర్లకు కన్నీళ్లు తప్పితే ఏం మిగల్లేదు. చాలా సింపుల్ బౌలింగ్‌తోనే అతను దూసుకొచ్చాడు. షమీ బౌలింగ్‌లో మిస్టరీ, స్క్రాంబిల్ సీమ్.. ఏమీ లేవు. అద్భుతమైన సీమ్ ప్రజంటేషన్, చక్కని మణికట్టు ఉపయోగం, వికెట్ల మీదకు బంతులు విసిరే సత్తా.. వీటితోనే అతను వరల్డ్ కప్‌లో తనకంటూ ప్రత్యేకమైన మార్గం వేసుకున్నాడు' అని హేడెన్ కితాబిచ్చాడు.

'ఒకవేళ షమీ కనుక అలా చేయకపోతే.. బంతి యాంగిల్ మార్చి రెండు వైపులా స్వింగ్ చేయగలడు. అతని బౌలింగ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే పర్‌ఫెక్షన్ అని మాత్రమే చెప్పగలం. వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు అందరం బ్యాటింగ్ గురించే మాట్లాడాం. కానీ బంతితో షమీ అదరగొడుతున్నాడు' అని మెచ్చుకున్నాడు.

ఈ క్రమంలో టీమిండియా లెజెండ్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే కూడా షమీ బౌలింగ్‌ను మెచ్చుకున్నాడు. షమీకి గతంలో మోకాలి సమస్య వచ్చిందని, అప్పటి నుంచి పెద్దగా పరిగెత్తడం లేదని చెప్పాడు. కానీ దాన్ని కూడా షమీ చక్కగా మేనేజ్ చేసుకుంటూ చెలరేగుతున్నాడని కొనియాడాడు.

Story first published: Friday, November 3, 2023, 17:06 [IST]
Other articles published on Nov 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+