Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: నిన్ను చూసినప్పుడే అనుకున్నా.. గొప్పోడివి అవుతావని: యువరాజ్ సింగ్

టీమిండియా వెటరన్ యువరాజ్ సింగ్, సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ మధ్య ఎంత మంచి బాండింగ్ ఉందో అందరికీ తెలిసిందే. కేన్సర్ నుంచి కోలుకొని యువీ రీఎంట్రీ ఇచ్చినప్పుడు అతనికి ఎంతో మద్దతిచ్చాడు కోహ్లీ. ఐపీఎల్‌లో కూడా ఆర్సీబీలోకి అతను వచ్చేలా చూసుకొని, ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఇద్దరూ పార్టీలు చేసుకునే కుర్రాళ్లే కావడంతో ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది.

ఈ క్రమంలోనే 35వ బర్త్ డే జరుపుకుంటున్న కోహ్లీకి యువీ బర్త్ డే విషెస్ చెప్పాడు. కోహ్లీని కలిసినప్పటి నుంచే అతను భవిష్యత్తులో గొప్ప ప్లేయర్ అవుతాడని తనకు అనిపించిందని చెప్పాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో కూడా దేశం గర్వించేలా చేయాలని కోహ్లీకి సూచించాడు. కోహ్లీ గురించి సోషల్ మీడియాలో యువీ చేసిన పోస్టు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

World Cup 2023 INDvsSA Yuvraj Singh heartfelt note on Kohlis birthday

'నువ్వు టీంలోకి కొత్తగా వచ్చినప్పుడే.. అవకాశాల కోసం ఆత్రుత, ఆడాలే ఆకలి చూశా. నిన్ను చూసిన అందరూ భవిష్యత్తులో నువ్వో గొప్ప ప్లేయర్ అవుతావని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు చరిత్రలో నీకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడంతోపాటు, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచావు కూడా. మరింత మెరుగవడంలో కుర్రాళ్లకు స్ఫూర్తిగా నిలిచావు' అని యువీ అన్నాడు.

'ఇప్పుడు కొత్త రికార్డులు బద్దలు కొడుతూ, మరికొన్ని రికార్డులు సృష్టిస్తూ మరో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఒక్క క్షణం ఆగి ఇప్పటి వరకు నువ్వు సాధించిన విజయాలను గుర్తుచేసుకో. నీతో ఈ ప్రయాణాన్ని పంచుకున్నందుకు, నువ్వు ఎదగడం చూసినందుకు చాలా గర్వపడుతున్నా. నీ ప్యాషన్, పట్టుదల ఈ వరల్డ్ కప్‌లో కూడా టీమిండియాను మరో మైలురాయికి చేర్చాలని ఆశిస్తున్నా. హ్యాపీ బర్త్ డే కింగ్ కోహ్లీ' అని యువీ పోస్టు చేశాడు.

Story first published: Sunday, November 5, 2023, 17:41 [IST]
Other articles published on Nov 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+