Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: ఈ ఐదు వెహికిల్స్ కోహ్లీ ఫేవరెట్.. ధరెంతో తెలుసా?

టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ తన 35వ బర్గ్ డే జరుపుకుంటున్నాడు. వరల్డ్ కప్‌లో మంచి ఫామ్ కనబరుస్తున్న ఈ టాప్ క్రికెటర్‌కు ఎంత ఫాలోయింగ్ ఉందో వేరే చెప్పక్కర్లేదు. కోహ్లీ గురించి ఏ చిన్న విషయం తెలిసినా ఫ్యాన్స్ తెగ సంతోషిస్తారు. అలాంటి వారి కోసమే.. కోహ్లీ వద్ద ఉన్న ఐదు టాప్ వెహికిల్స్ ఏవో చూసేద్దామా?

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్:కోహ్లీకి ఎక్కుగా కార్లే ఇష్టం. కానీ అందుకని అతనికి బైకులంటే ఇష్టం లేదని కాదు కదా. ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయం వెల్లడించిన కోహ్లీ.. బైక్ రైడింగ్ అన్నా కూడా తనకు చాలా ఇష్టం అని చెప్పాడు. బైక్‌పై లాంగ్ రైడ్ వెళ్లడం అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు.

World Cup 2023 INDvsSA These are Virat Kohlis favourite vehicles

ఈ క్రమంలోనే 2018లో హీరో కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కోహ్లీ పనిచేశాడు. ఈ సమయంలోనే హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ తీసుకున్న అతను.. దానిపై చాలాసార్లు షికారు చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ బైక్ ధర రూ.1.3 లక్షలు.

ఆడీ ఆర్ఎస్5:ఇక కోహ్లీకి కార్లంటే ఎంత పిచ్చో అందరికీ తెలిసిందే. వాటిలో పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా కూడా కోహ్లీ సేవలందించాడు. ఈ క్రమంలోనే జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల కంపెనీ ఆడీతో కూడా కొంతకాలం క్రితం ఒప్పందం చేసుకున్నాడు.

ఈ క్రమంలోనే ఆడీ ఆర్ఎస్5 కారు కూడా అందుకొని, భారత్‌లో ఈ కారు అందుకున్న తొలి వ్యక్తిగా నిలిచాడు. 2019లో ఈ కారుతో ఉన్న ఫొటోను కోహ్లీ షేర్ చేయగా.. అది తెగ వైరల్ అయింది. ఈ కారు ధర రూ.1.13 కోట్లు.

ల్యాండ్ రోవర్ వోగ్:కోహ్లీ వద్ద ఉన్న లగ్జరీ కార్లలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ ఎస్‌యూవీ ఒకటి. స్టైలిష్ డిజైన్‌తో ఉన్న ఈ కారులో పలుమార్లు కోహ్లీ కనిపించాడు. దేశంలో చాలా మంది సెలెబ్రిటీలు ఈ కారును ప్రిఫర్ చేస్తుంటారు. వారిలో కోహ్ల కూడా ఒకడు. రూ.2.28 కోట్ల విలువైన ఈ కారును కొన్న అతను.. దానికి ప్రత్యేకంగా '1818' నెంబరు కూడా తీసుకున్నాడు.

బెంట్లీ ఫ్లైయింగ్ స్పర్:కోహ్లీ వద్ద ఉన్న మరో రెండు లగ్జరీ కార్లు కూడా బెంట్లీ కంపెనీకి చెందినవే కావడం గమనార్హం. వాటిలో బెంట్లీ ఫ్లైయింగ్ స్పర్ ఒకటి. ఈ కారులో ముంబైలో తిరుగుతూ కోహ్లీ చాలాసార్లు అభిమానుల కంట పడ్డాడు. అంతేకాదు, ఎయిర్‌పోర్టుకు వెళ్లి వచ్చేటప్పుడు కూడా ఎక్కువ సార్లు ఈ కారులోనే అతను వెళ్తుంటాడు. దీనికి కూడా '1818' నెంబరే ఉంటుంది. ఈ కారు ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.2 కోట్ల నుంచి రూ.3.41 కోట్ల వరకు ఉంటుంది.

బెంట్లీ కాంటినెంటల్ జీటీ:కోహ్లీ దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి బెంట్లీ కాంటినెంటల్ జీటీ. కోహ్లీకి చాలా ఇష్టమైన కార్లలో ఇదొకటి. దీని ధర సుమారు రూ.4 కోట్లు ఉంటుంది. అయితే దీన్ని కోహ్లీ ఎక్కువగా వాడడు. ఢిల్లీలోని తన ఇంట్లోనే ఉంటుందట ఈ వెహికిల్. తను ఢిల్లీ వెళ్లినప్పుడు అప్పుడప్పుడూ బయటకు తీస్తుంటాడని సమాచారం.

Story first published: Sunday, November 5, 2023, 16:30 [IST]
Other articles published on Nov 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+