Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: సఫారీలపై గెలిచినా.. టీమిండియా ఈ తప్పులు సరిదిద్దుకోవాలి!

సౌతాఫ్రికాపై టీమిండియా అదిరిపోయేవి జయం సాధిచింది. ఉత్కంఠగా సాగుతుందని అనుకున్న టాప్ టు పోరును పూర్తి ఏకపక్షంగా మార్చేసింది. దీన కోసం కేవలం బౌలర్లనే పెట్టిన రోహిత్ శర్మ కొన్ని పొరపాట్లు చేశాడు. అవేంటంటే?

ఇదే లాస్ట్ ఛాన్స్: టీమిండియా బెంచ్ సామర్ధ్యాన్ని చెక్ చేసుకోవడానికి ఒక విధంగా ఇదే జట్టుు లాస్గ్ ఛాన్స్. అశ్విన్, కొత్తగా జట్టులో చేరిన ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాన్ కిషన్ అందర్నీ ఈ మ్యాచులో ఆడిస్తారని అంతా అనుకున్నారు. కానీ రోహిత్ మాత్రం అదే జట్టుతో బరిలో దిగాడు. దీంతో బెంచ్‌పై ఉన్న ఆటగాళ్ల సత్తా తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది.

World Cup 2023 INDvsSA these are the mistakes done my team india

డెత్ ఓవర్ల బ్యాటింగ్: బౌలింగ్‌కు పూర్తిగా సహకరిస్తున్న ఈ పిచ్‌పై 250 పరుగులు చేస్తే మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది. కానీ టీమిండియా 326 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే డెత్ ఓవర్లలో టీమిండియా ఆశించినంత వేగంగా ఆడలేకపోయింది. సూర్యకుమార్ యాదవ్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు.

ఇక కోహ్లీ కూడా ఆశించినంతు వేగంగా ఆడలేకపోయాడు. నాకౌట్ గేమ్స్‌లో బలమైన టీమ్స్‌ను ఎదుర్కొనేటప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి డెత్ ఓవర్లలో బ్యాటింగ్‌ను టీమింయా కొం మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉంది.

జడ్డూ మాయ: ఇక టీమిండియాకు ఈ మ్యాచులో అతి పెద్ద పాజిటివ్ రవీంద్ర జడేజా అనే చెప్పాలి. బ్యాటింగ్‌లో కేవలం 15 బంతుల్లోనే 29 పరుగులు చేసి అజేయంగా నిలిచిన జడ్డూ.. బంతితో కూడా చెలరేగాడు. ఏకంగా ఐదు వికెట్లు తీసుకొని తను కూడా జట్టులో ఉన్నానని చాటి చెప్పాడు.

అతనికి పూర్తి మద్దతు ఇచ్చిన రోహిత్ శర్మ.. అతని బౌలింగ్‌కు తగ్గట్లే ఫీల్డింగ్ సెట్ చేశాడు. దీంతో రెచ్చిపోయిన జడ్డూ.. దాదాపు ప్రతి డెలివరీకి వికెట్ తీసుకునేలా కనిపించాడు. మిగతా బౌలర్లు కూడా రాణించారు.

Story first published: Monday, November 6, 2023, 11:22 [IST]
Other articles published on Nov 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+