Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: కోహ్లీ అంటే ఏంటి?.. టీమిండియా స్టార్ల మనసులో మాట ఇదీ..!

ప్రపంచ క్రికెట్‌లో సూపర్ స్టార్ ఎవరంటే అందరూ చెప్పే పేరు విరాట్ కోహ్లీ. ప్రత్యర్థి జట్లు, దేశాలు కూడా విరాట్ ఆటకు, పట్టుదలకు దాసోహం అంటాయి. అలాంటి కోహ్లీకి భారత్‌లో ఎంత ఫాలోయింగ్ ఉందో వేరే చెప్పక్కర్లేదు. టీమిండియాలో కూడా దాదాపు అందరు ప్లేయర్లకూ విరాట్ ఒక ప్రేరణ.

ఈ క్రమంలోనే 35వ వసంతంలోకి అడుగు పెట్టిన విరాట్ గురించి టీమిండియా ప్లేయర్లు తమ మనసులోని మాటలను పంచుకున్నారు. ఐసీసీ ఇన్‌స్టాగ్రాంలో దీనికి సంబంధించిన వీడియోను పంచుకుంది. ఈ వీడియోలో గిల్, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, తదితరులు అందరూ కోహ్లీపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ వీళ్లు కోహ్లీ గురించి ఏం చెప్పారంటే?

 World Cup 2023 INDvsSA Team India stars take on Virat Kohli as he turns 35

'ఈ ఆట కోసం కోహ్లీ ఆకలి, ప్యాషన్ ఎవరి దగ్గరా ఉండవు. ఆట కోసం అంత ఆకలిగా, ప్యాషన్‌గా ఉండే ఎవర్నీ నేను ఇంత వరకు చూడలేదు' - శుభ్‌మన్ గిల్.

'ఇంతకాలం ఆడిన తర్వాత కూడా ఆట కోసం అతనిలో ఉన్న ఫైర్, డెడికేషన్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అది పెరుగుతూనే ఉంది. నేను కూడా అది నేర్చుకోవాలని అనుకుంటున్నా. నేను కాదు మ్యాచ్ చూసే ప్రతి ఒక్కరూ కోహ్లీ నుంచి చాలా నేర్చుకుంటారని కచ్చితంగా చెప్తా' - జస్‌ప్రీత్ బుమ్రా

'తనదొక ఫిట్‌నెస్ కల్చర్. ఆ బంధం కూడా ఉంది. ఎప్పుడూ ఆటలోనే ఉంటాడు. మాలో చాలా మందికి అది స్ఫూర్తినిస్తుంది. అదే సమయంలో కోట్లాది మంది ఫ్యాన్స్‌కు కూడా అదే స్ఫూర్తి' - హార్దిక్ పాండ్యా

'భారత క్రికెట్ చుట్టూ తిరిగే ఆలోచనల డీఎన్ఏ మార్చేశాడు కోహ్లీ. ఒక బ్యాటర్ ఎలా మ్యాచ్‌ను అర్థం చేసుకోవాలి? మ్యాచ్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి? అన్నీ మార్చేశాడు' - రవిచంద్రన్ అశ్విన్

Story first published: Sunday, November 5, 2023, 12:19 [IST]
Other articles published on Nov 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+