Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: ఈ జోరు నాకౌట్స్‌లో కూడా కొనసాగించాలి: సునీల్ గవాస్కర్

సౌతాఫ్రికాపై టీమిండియా ఘనవిజయం సాధించింది. టేబుల్ టాపర్ల మధ్య పోరును పసికూనతో పోరుగా మార్చేసిన భారత్.. ఏకంగా 243 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇలా భారత జట్టు తిరుగులేని విజయం సాధించడంపై భారత లెజెండ్ సునీల్ గవాస్కర్ తెగ సంతోషం వ్యక్తం చేశాడు. కప్పు కొట్టాలంటే ఇలాగే ఆడాలని చెప్పాడు

'మీరు ఛాంపియన్స్ అవ్వాలంటే.. ఇలా భారీ విజయాలు చాలా అవసరం. మిగతా టీమ్స్ మనతో కనీసం పోటీలో లేవని అందరికీ తెలిసేలా చెయ్యాాలి. ప్రస్తుతం భారత జట్టు . ఇలా టేబుల్ టాపర్స్ మధ్య కీలక పోరులో భారత చెలరేగడం సరైన పనే. ప్రస్తుతం ఇలా చేయడమే కదా కావాలి' అని గవాస్కర్ చెప్పాడు.

World Cup 2023 INDvsSA Sunil Gavaskar wants team india to be ruth less

'ఇంకా నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ఉంది. అది ఇప్పుడు పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు టీమిండియా తన టాప్ స్సాట్‌ను సిమెంట్ చేసుకుంది. అయితే టీమిండియా ఈ స్టేజిలో, ముఖ్యంగా నాకౌట్స్‌లో తడబడకూడదు.' అని సన్నీ అన్నాడు. వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచులు ఆడిన టీమిండియా వరుస విజయాలతో 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

ఇక కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచులో బ్యాటింగ్ చాలా కష్టంగా ఉన్న పిచ్‌పై కూడా టీమిండియా చెలరేగింది. విరాట్ కోహ్లీ (101 నాటౌట్), శ్రేయాస్ అయ్యర్ (77) అద్భుతంగా ఆడారు. వీళ్లిద్దరూ చెలరేగడంతో భారత జట్టు 326 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేజింగ్‌లో జడేజా ఐదు వికెట్లతో చెలరేగడంతో సింపుల్ విజయం సాధించింది.

నాకౌట్ మ్యాచుల్లో కూడా టీమిండియా ఇదే తరహా ఆటను కొనసాగించాలని సునీల్ గవాస్కర్ అన్నాడు. 'నాకౌట్స్ మ్యాచుల్లో కూడా ఇలాగే ఉండాలి. ఎందుకంటే లీగ్ దశలో మన బుర్రలో.. ఇది పోతే ఇంకో మ్యాచ్ ఉంది అనే ఆలోచన ఉంటుంది. అది నాకౌట్స్ టైంలో అస్సలు పనికిరాదు. నాకౌట్స్‌లో ఆ రోజు నీది కాకపోతే చావులు తింటాయి' అని మెచ్చుకున్నాడు.

Story first published: Monday, November 6, 2023, 8:31 [IST]
Other articles published on Nov 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+