Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsSA: కోహ్లీ పుట్టిన రోజున భారత్ కీలక పోరు.. ఈ మ్యాచ్‌పై వరుణుడు కన్నేశాడా?

World Cup 2023: వరల్డ్ కప్‌లో ఫ్యాన్స్ అంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్న మ్యాచ్‌కు సమయం వచ్చేసింది. బలమైన భారత్, సౌతాఫ్రికా తలపడేందుకు రెడీ అవుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ రెండు జట్లు ఢీకొంటున్నాయి. సరిగ్గా ఈ మ్యాచ్ ముందే టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. జట్టుకు దూరమైన వార్త వచ్చింది. మడమ గాయంతో అతను మెగా టోర్నీకి దూరమయ్యాడు.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ టాప్ ప్లేస్‌లో ఉంది. సౌతాఫ్రికా రెండో స్థానంలో ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ విషయంలో మాత్రం 2.290తో భారత్‌ కన్నా మెరుగైన స్థానంలో ఉంది. సఫారీ బ్యాటర్లు ఈ టోర్నీలో రెచ్చిపోతున్నారు. బౌండరీల వర్షం కురిపిస్తున్నారు. డీ కాక్, వాన్ డర్ డస్సెన్, హెన్రిక్ క్లాసెన్, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ వార్నర్, మార్కో యాన్సెన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు.

 World Cup 2023 INDvsSA pith and weather report on Virat Kohlis birthday match

ఈ బలమైన బ్యాటింగ్ లైనప్‌ను టీమిండియా బౌలర్లు ఎలా కట్టడి చేస్తారనేది కీలకం. ఇక ఈడెన్ గార్డెన్స్ పిచ్ విషయానికి వస్తే.. ఈ పిచ్ సాధారణంగా బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. బౌలర్లకు కూడా కొంత సహకారం లభించినా.. ఎక్కువగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్‌గా ఈడెన్ గార్డెన్స్‌కు పేరు. అయితే మ్యాచ్ జరిగేకొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపించే అవకాశం ఉంది.

బెంగళూరులో భారీ వర్షంతో పాకిస్తాన్, న్యూజిల్యాండ్ మ్యాచ్ అర్ధంతరంగా ముగియడంతో.. భారత్, సౌతాఫ్రికా మ్యాచ్ పరిస్థితి ఏంటని కొందరు ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. వాళ్లకు ఎలాంటి భయం అక్కర్లేదు. కోల్‌కతాలో మ్యాచ్ సమయంలో వర్షం పడే సూచనలేమీ లేవని తెలుస్తోంది. ఇక్కడ మ్యాచ్ సమయంలో గరిష్టంగా 32 డిగ్రీల ఎండ ఉంటుందట. కాబట్టి ఫ్యాన్స్ ఫుల్ 100 ఓవర్ల మ్యాచ్ చూస్తారు. ఇక టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజున ఈ మ్యాచ్ జరుగుతుండటంతో ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహం నెలకొన్న సంగతి తెలిసిందే.

Story first published: Sunday, November 5, 2023, 8:55 [IST]
Other articles published on Nov 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+