సౌతాఫ్రికాపై టీమిండియా గెలవడంలో రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. సఫారీలను కేవలం 83 పరుగులకే ఆలౌట్ చేయడంలో జడేజాదే ముఖ్యమైన రోల్. ఐదు వికెట్లతో చెలరేగిన అతను.. ఏ బ్యాటర్‌నూ క్రీజులో కుదురుకోనివ్వలేదు. అద్భుతంగా బౌలింగ్ వేసిన అతను.. మ్యాచ్ ముగిసిన తర్వాత జట్టులో తన పాత్రపై మాట్లాడాడు.
'మొదటి రోజు నుంచీ నేను కెప్టెన్‌లాగే ఆలోచిస్తున్నా. నేను కెప్టెన్ కాదనేది వేరే విషయం అనుకోండి. ఒక ఆల్‌రౌండర్‌గా 30-35 పరుగులుచేయడం, అవసరమైనప్పుడు ప్రత్యర్థి భాగస్వామ్యాలు బ్రేక్ చేయడం ఇదే నా పని. టీంలో నాకు ఇచ్చిన పాత్ర అదే. నేను ప్రతి మ్యాచులో ప్రభావం చూపే ప్రదర్శనే చేయాలని అనుకుంటా' అని జడ్డూ చెప్పాడు.

'ఫీల్డింగ్‌ను నేను ఎప్పుడూ ఈజీగా తీసుకోను. నేను కూడా క్యాచులు మిస్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎప్పుడు క్యాచ్ వచ్చినా పట్టేయడానికి రెడీగా ఉంటా. మైదానంలో ఎప్పుడూ రిలాక్స్ అవ్వను. అందుకే ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటా. ఒక్కోసారి అనుకున్నట్లు జరగదు. ఒక్కోసారి జరుగుతుంది. కానీ ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటా' అన్నాడు.
సౌతాఫ్రికాపై ఐదు వికెట్లతో చెలరేగిన అతను.. ఈ వరల్డ్ కప్‌లో దాదాపు అన్ని మ్యాచుల్లోనూ జడ్డూ బంతితో తన మాయ చేస్తూనే ఉన్నాడు. ఒకటిీ అరా వికెట్లు తీసుకుంటూ వస్తున్నాడు. సఫారీలతో మ్యాచులో తన ప్రదర్శనపై మాత్రం సంతృప్తి వ్యక్తం చేశాడు.
'ఇటీవల ఆడిన మ్యాచుల్లో నా రిథమ్ చాలా బాగుంది. కీలకమైన మ్యాచుల్లో జట్టు విజయాల్లో పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది. అటు బంతితో, ఇటు బ్యాటుతో రాణిస్తున్నందుకు ఆనందంగా ఉంది. వచ్చే మ్యాచుల్లో నా ఆటపై మరింత కాన్ఫిడెంట్‌గా ఉంటా' అని చెప్పాడు. జడ్డూ కనుక ఇదే ఫామ్ కొనసాగిస్తే.. భారత్‌కు కచ్చితంగా ఇది శుభవార్తే అని ఫ్యాన్స్ అంటున్నారు.