Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: కోహ్లీ లెగసీ బ్యాటింగ్ కాదు.. అప్పట్లో పెద్దగా ఆడలేదు.. ఆ తర్వాత ఏం చేశాడంటే?

World Cup 2023: వరల్డ్ కప్‌లో అద్భుతమైన శతకంతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్‌గా సచిన్ రికార్డును కోహ్లీ సమం చేశాడు. ఇప్పటికే క్రికెట్‌లోని మోడ్రన్ గ్రేట్స్‌లో ఒకడిగా ఉన్న కోహ్లీ.. కెరీర్ ఆరంభంలో తడబడ్డాడు. దీంతో అతను కూడా సాధారణ ఆటగాడే అని కొందరు అనుకున్నారు. కానీ ఆ అంచనాలను తలకిందులు చేసిన కోహ్లీ.. ప్రపంచ క్రికెట్ ముఖచిత్రంగా ఎదిగాడు.

కోహ్లీ కెరీర్ ఇలా మలుపు తిరగడంలో కీలక పాత్ర పోషించిన వారిలో అప్పటి చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఒకడు. తాజాగా సచిన్ రికార్డును కోహ్లీ సమం చేసిన సందర్భంగా అతనిపై దిలీప్ ప్రశంసల వర్షం కురిపించాడు. 2008లో శ్రీలంకతో సిరీసు కోసం కోహ్లీని ఎంపిక చేసిన ప్యానెల్‌లో దిలీప్ ఉన్నాడు. ఆ సిరీసులో ఐదు మ్యాచులు ఆడిన కోహ్లీ కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు.

World Cup 2023 INDvsSA Dilip Vengsarkar says Kohlis greatest legacy is not his batting

'2008 ఆగస్టులో శ్రీలంకతో వన్డే సిరీసు కోసం కోహ్లీని మేం సెలెక్ట్ చేశాం. ఆ టూర్‌లో ఒక్క హాఫ్ సెంచరీ మినహా అతను పెద్దగా పరుగులు చేయలేదు. కానీ ఆ టూర్‌లో మమ్మల్ని ఇంప్రెస్ చేశాడు. అంతకుముందు ఎండాకాలంలో ఐపీఎల్ అతను చాలా పేలవమైన ప్రదర్శన చేశాడు. కానీ శ్రీలంక టూర్‌లో ఫర్వాలేదనిపించాడు' అని గుర్తుచేసుకున్నాడు.

'కోహ్లీ ఆ తర్వాత తనను తాను మార్చుకొని, తన క్రికెట్‌ను కొత్తగా ఆవిష్కరించుకున్న విధానాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. తనను తానే కొత్తగా లాంచ్ చేసుకున్నాడు. ఆట, ఫిట్‌నెస్‌పై చాలా కష్టపడ్డాడు. దీంతో అత్యుత్తమ క్రికెటర్‌గా ఎదిగాడు' అని మెచ్చుకున్నాడు. కోహ్లీ తొలిసారి భారత జెర్సీ ధరించి 15 ఏళ్లు దాటిపోయింది. ప్రస్తుతం 26 వేలకుపైగా అంతర్జాతీయ పరుగులు చేశాడీ ఛేజ్ మాస్టర్.

World Cup 2023 INDvsSA Dilip Vengsarkar says Kohlis greatest legacy is not his batting

అయితే కేవలం బ్యాటింగ్ మాత్రమే కాదని, జట్టులోకి కోహ్లీ తీసుకొచ్చిన ఫిట్‌నెస్ కల్చర్ ఇంకా చాలా కాలం అతని లెగసీగా మిగిలిపోతుందని దిలీప్ వెంగ్‌సర్కార్ అన్నాడు. 'కోహ్లీ నుంచి మనం చాలా ఆశిస్తాం. ఎంతలా అంటే అతను సెంచరీలు చేయడం చూసి, చూసి 70 లేదా 80 కొడితే కోహ్లీ ఫెయిలయ్యాడని అనేస్తాం' అని వెంగ్‌సర్కార్ చెప్పుకొచ్చాడు.

'భారత క్రికెట్‌లో కోహ్లీ అతిపెద్ద లెగసీ అతను తీసుకొచ్చిన ఫిట్‌నెస్ కల్చర్ అని చెప్పాలి. ఇది పూర్తిగా భారత క్రికెట్ టీం సిస్టంను మార్చేసింది. ఇప్పుడు కూడా సింగిల్ వచ్చే చోట డబుల్ తీస్తూ.. డబుల్ వచ్చే చోట అతను ట్రిపుల్ తీస్తుంటే.. నా అకాడమీలో పిల్లలకు కూడా అది చూపిస్తుంటా. అలాంటి ఫిట్‌నెస్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలని చెప్తుంటా' అని వెంగ్‌‌సర్కార్ తెలియజేశాడు.

Story first published: Tuesday, November 7, 2023, 17:39 [IST]
Other articles published on Nov 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+