Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsPAK: ఈ చెత్త వాగుడుతో తప్పించుకోవాలని ప్లాన్ వేశావా?

టీమిండియా చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడింది. ఈ ఓటమి అవమానాన్ని ఎలా కవర్ చేసుకోవాలో తెలియని పాక్.. వేరే విషయాల వైపు వేళ్లు చూపిస్తోంది. పాక్ టీం డైరెక్టర్ మిక్కీ ఆర్థర్.. ఈ మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ ఇది ఐసీసీ టోర్నమెంట్‌లా లేదన్నాడు. ప్రేక్షకులు అందరూ భారత్‌కే సపోర్ట్ ఇచ్చారని, ఇది ఐసీసీ టోర్నీలా ఏమాత్రం అనిపించలేదని చెప్పాడు.

దీనిపై పాక్ మాజీ లెజెండ్ వసీం అక్రమ్ సీరియస్ అయ్యాడు. జనాలు చీర్ చేయాలనే ప్లాన్‌తో స్టేడియానికి వచ్చారా? అంటూ చురకలేశాడు. ఇలాంటి చెత్త వాగుడు వాగడం కన్నా. కుల్దీప్ యాదవ్ వంటి కీలక బౌలర్ గురించి మాట్లాడాల్సిందని అన్నాడు. ఈ మ్యాచులో సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్ ఇద్దర్నీ కుల్దీప్ యాదవ్ గురించి మాట్లాడాల్సిందని అక్రమ్ చెప్పాడు.

World Cup 2023 INDvsPAK Wasim Akram slams pakistan for making useless excuses

పాకిస్తాన్ టీం చివరి ఎనిమిది వికెట్లను కేవలం 36 పరుగుల తేడాలో కోల్పోయింది. ఇదే విషయాన్ని అక్రమ్ ప్రశ్నించాడు. దీని గురించి మిక్కీ ఆర్థర్ మాట్లాడాల్సిందని నిలదీశాడు. పాకిస్తాన్‌కు ఫ్యాన్స్ సపోర్ట్ ఇవ్వలేదని, అది కూడా ఈ మ్యాచ్‌పై ప్రభావం చూపించిందని ఆర్థర్ అన్నాడు. ఇదేదో బీసీసీఐ ఈవెంట్‌లా అనిపించిందే కానీ, వరల్డ్ కప్‌లా లేదన్నాడు.

దీనిపై చాలా సీరియస్‌గా రియాక్ట్ అయిన వసీం అక్రమ్.. 'అసలు మీ ప్లాన్ ఏంటి బ్రదర్? ఎలాంటి ప్లాన్ వేసుకొని మ్యాచ్ ఆడేందుకు వచ్చావు? కుల్దీప్ యాదవ్‌ను ఎలా ఎదుర్కోవాలని అనుకున్నారు? అది కదా మేం వినాలని అనుకుంది. ఈ చెత్త వాగుడు కాదు. అంటే ఇలా మాట్లాడి ఈ ఓటమి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావ్ కదా' అంటూ ఆర్థర్‌పై విమర్శల వర్షం కురించాడు.

ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. అయితే వీసాలు అందని కారణంగా చాలా మంది పాక్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్‌కు రాలేకపోయారు. దీంతో స్టేడియం అంతా టీమిండియా ఫ్యాన్స్‌తో నిండిపోయింది.

Story first published: Sunday, October 15, 2023, 9:54 [IST]
Other articles published on Oct 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+