Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsPAK: పాకిస్తాన్ టీంలా లేదు.. స్కూల్ పిల్లల్లా ఆడారు.. ట్రోల్ చేసిన సెహ్వాగ్!

వరల్డ్ కప్‌లో భాగంగా జరిగిన మ్యాచులో పాకిస్తాన్‌ను టీమిండియా చిత్తు చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఆశించిన స్కోరు చేయలేదు.. ఆరంభంలో భారీ స్కోరు చేసేలా కనిపించిన పాకిస్తాన్ టీం.. ఆ తర్వాత చతికిలపడింది.

చివరి ఎనిమిది వికెట్లను కేవలం 36 పరుగుల తేడాలో కోల్పోయింది. దీంతో ఆ జట్టు 191 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక ఛేజింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దీంతో భారత జట్టు ఈ మ్యాచులో సునాయాస విజయం సాధించింది. ఇది చూసిన పాక్ ఫ్యాన్స్ చాలా చికాకు పడ్డారు.

World Cup 2023 INDvsPAK Virender Sehwag trolls pakistan team for the loss

దీనిపై టీమిండియా మాజీ లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడాడు. పాకిస్తాన్ గాలి పోయేలా ఒక ట్వీట్ చేశాడు. 'మ్యాచ్ చూస్తే.. పెద్ద కుర్రాళ్లు వెళ్లి స్కూల్ పిల్లలతో ఆడినట్లు ఉంది' అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పడం సెహ్వాగ్‌కు అలవాటని తెలిసిందే. ఎదుటి వాళ్లు ఫీలవుతారని కూడా సెహ్వాగ్ పెద్దగా ఆలోచించడు.

ఈ క్రమంలోనే ఫ్యాన్స్ అందరూ కూడా సెహ్వాగ్ మాటలతో ఏకీభవిస్తున్నారు. ఈ మ్యాచులో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్ ఇద్దరూ క్రీజులో ఉన్నప్పుడు పాకిస్తాన్ భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ వీళ్లు అవుటైన వెంటనే ఆ టీం తలరాత కూడా మారిపోయింది. హాఫ్ సెంచరీ పూర్తవగానే బాబర్ మైదానం వీడాడు.

ఇక రిజ్వాన్ అయితే హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకోలేదు. అందుకే ఈ మ్యాచ్ చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా పాకిస్తాన్ టీంను తెగ తిట్టిపోస్తున్నారు. పాకిస్తాన్ టీం మరీ చిన్నపిల్లల టీంలా ఆడిందని, ఏమాత్రం ప్రతిఘటన కనబర్చలేదని అంటున్నారు. మరి మిగతా మ్యాచుల్లో అయినా రాణించి, పాకిస్తాన్ సెమీస్‌లో మళ్లీ మనతో తలపడుతుందేమో చూడాలి.

Story first published: Sunday, October 15, 2023, 11:36 [IST]
Other articles published on Oct 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+