Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsPAK: రిజ్వాన్‌ను ట్రోల్ చేసిన కోహ్లీ.. ఫ్యాన్స్ కూడా ఫ్ట్రస్ట్రేట్ అయిపోయారుగా!

భారత్‌, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచులో విరాట్ కోహ్లీకి కోసం వచ్చింది. ఇమామ్ ఉల్ హక్ (39) అవుట్ అవగానే. . రిజ్వాన్ క్రీజులోకి వచ్చాడు. అతను వచ్చీ రాగానే ఇన్నింగ్స్ మళ్లీ మొదలవ్వాలి. దీని కోసం టీమిండియా రెడీ అయింది. మంచి ఫామ్‌లో ఉన్న రిజ్వాన్‌కు కళ్లెం వేయడానికి ప్లాన్స్ ఆలోచించడం మొదలు పెట్టింది.

అయితే రిజ్వాన్ ఇక్కడే అతి తెలివి తేటలు చూపించాడు. క్రీజులోకి రాగానే బ్యాటింగ్‌కు రెడీ అవ్వాల్సిన అతను.. అక్కడే ఉన్న కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో ఏదో విషయమై మాట్లాడటం మొదలు పెట్టాడు. ఇలా ఎంత సేపటికీ రిజ్వాన్ క్రీజులోకి రాకపోవడం చూసిన టీమిండియా ఆటగాళ్లకు చిరాకేసింది.

World Cup 2023 INDvsPAK Virat Kohli mocks Rizwan for his delay tactics

ఇలా రిజ్వాన్ వల్ల అయినా సరే సమయానికి ఓవర్ల కోటా పూర్తి చేయకపోతే భారత్‌ పరిణామాలు ఎదుర్కోక తప్పదు. చివర్లో 30 యార్డ్స్ సర్కిల్ అవతల ఒక ఫీల్డర్‌ను కోల్పోవాల్సి వస్తుంది. అందుకే రిజ్వాన్ తన అతి తెలివి తేటలు చూపించి టైం వేస్ట్ చేశాడు. ఇది అర్థం చేసుకున్న రోహిత్ శర్మ.. వెంటనే అంపైర్ వద్దకు వెళ్లి దీనిపై కంప్లయింట్ ఇచ్చాడు.

సరిగ్గా అప్పుడే ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ కూడా చికాకు పడిపోయాడు. చేతికి ఉన్న వాచ్ చూస్తూ రిజ్వాన్‌పై సీరియస్ అయ్యాడు. 'ఏంటీ టైం వేస్ట్?' అనేలా సైగలు చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ వెంటనే తమ ఫ్రస్ట్రేషన్‌ను కూడా ప్రకటించారు. పెద్దగా అరుస్తూ రిజ్వాన్‌ను గేలి చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ మ్యాచులో రిజ్వాన్ (49) ఫర్వాలేదనిపించాడు. హాఫ్ సెంచరీకి సరిగ్గా పరుగు దూరంలో అతను అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పాక్ బ్యాటర్లు ఎవరూ క్రీజులో నిలవలేకపోయారు. దీంతో ఆ జట్టు కేవలం 191 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది.

Story first published: Sunday, October 15, 2023, 8:27 [IST]
Other articles published on Oct 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+