Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsPAK: బాబర్‌కు ఆటోగ్రాఫ్ ఇచ్చిన కోహ్లీ.. వీడియో వైరల్!

వరల్డ్ కప్‌లో అతిపెద్ద మ్యాచ్ భారత్, పాకిస్తాన్ ఏకపక్షంగా సాగింది. టీమిండియా ఈ మ్యాచులో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో ఏకంగా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది

ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు.. బాబర్ ఆజమ్ (50), మహమ్మద్ రిజ్వాన్ (49), ఇమామ్ ఉల్ హక్ (30) ఫర్వాలేదనిపించడంతో 191 పరుగులకు ఆలౌట్ అయింది. మిగతా బ్యాటర్లు ఎవరూ ఏమాత్రం రాణించలేదు. అదే సమయంలో భారత బౌలర్లు సమిష్టిగా రాణించి పాకిస్తాన్ కొంప ముంచారు.

World Cup 2023 INDvsPAK Virat Kohli gifts his signed jersey to Babar Azam

ఆ తర్వాత ఛేజింగ్‌లో రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో భారత జట్టు ఈ ఛేజ్‌ను సునాయాసంగా ముగించింది. ఈ మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ దగ్గరకు వెళ్లిన అతను.. ఒక జెర్సీ అడిగాడు.

కోహ్లీ తన జెర్సీ ఇస్తే దానిపై సంతకం చేయాలని అడిగాడు. పక్కన ఉన్న ఒక పాక్ టీం సిబ్బందిని అడిగి పెన్ తీసుకొని కోహ్లీ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఇలా కోహ్లీ తన జెర్సీపై ఆటోగ్రాఫ్స్ చేసి పాక్ కెప్టెన్‌కు ఇస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన వాళ్లంతా కూడా కోహ్లీకి బాబర్ కూడా పెద్ద ఫ్యానే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ మ్యాచులో బాబర్ హాఫ్ సెంచరీతో ఫర్వాలేదనిపించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో విరాట్ కోహ్లీ అంతగా ఆకట్టుకోలేదు. తొలి పవర్‌ప్లే చివరి ఓవర్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన అతను వికెట్ పారేసుకున్నాడు.

Story first published: Sunday, October 15, 2023, 9:02 [IST]
Other articles published on Oct 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+