Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsPAK: గంటన్నరలో టికెట్లు మాయం.. భోరుమంటున్న ఫ్యాన్స్!

ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రేమికుల్లో ఎంత క్రేజ్ ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అదే ఆ మ్యాచ్ వరల్డ్ కప్‌లో అయితే? ఇక ఆ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ వేరే లెవెల్ అనే చెప్పాలి. అక్టోబర్ 14న గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇదే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎప్పటి వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఆదివారం నాడు ఈ టికెట్ల అమ్మకాలను 'బుక్‌మైషో' మొదలు పెట్టింది.

అయితే ఇలా టికెట్ల అమ్మకం మొదలైన 90 నిమిషాల్లోనే అన్ని టికెట్లు అమ్ముడుపోయాయి. దీంతో చాలా మంది ఫ్యాన్స్ నిరాశ చెందారు. ముఖ్యంగా టికెట్లు బుక్ చేసుకునే సమయంలో వెయిటింగ్ లిస్ట్‌ చూపించడం, గంటల తరబడి యాప్ కానీ, వెబ్‌సైట్ కానీ క్లోజ్ చేయకుండా వెయిట్ చేసినా టికెట్లు దొరక్కపోవడంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆదివారం సాయంత్రం 8 గంటలకు మొదలైన టికెట్ల అమ్మకాలు 9.30 ప్రాంతానికి ముగియడం గమనార్హం.

World Cup 2023 INDvsPAK tickets sold out in 90 minutes

అధికారిక సమాచారం ప్రకారం, ఈ మ్యాచ్ టికెట్ల ధర కనీసం రూ.2 వేల నుంచి ఉంది. అయితే ఈ టికెట్లకు భారీ డిమాండ్ ఉండటంతో కస్టమర్లను క్యూలో వెయిట్ చేయాలని 'బుక్‌మైషో' కోరింది. ఈ క్యూలో వెయిట్ చేయాల్సిన టైం కనీసం 2 గంటల నుంచి కొంత మందికి 16 గంటల వరకు చూపించడం ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. అంతేకాదు, యాప్‌లో లేదా వెబ్‌సైట్‌‌లో టికెట్లు బుక్ చేసుకునే వాళ్లు ఈ వెయిటింగ్ టైంలో వాటిని క్లోజ్ చేయొద్దని నోటిఫికేషన వచ్చిందట.

కానీ అంతసేపు వెయిట్ చేసినా చాలా మందికి టికెట్లు దొరకలేదు. ఎందుకంటే వెయిట్ చేస్తే టికెట్లు దొరుకుతాయని బుక్‌మైషో ఎక్కడా చెప్పలేదు. దీంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బుక్‌మైషోకి ఇదేదో సర్కస్‌లా ఉందంటూ కొందరు అసహనం వ్యక్తం చేశారు. మరికొందరేమో 16 గంటలు వెయిటింగ్ టైం చూపించిందని, ఆ తర్వాత కాసేపటికే టికెట్లు అయిపోయాయని సోషల్ మీడియాలో భోరుమంటన్నారు.

చాలామంది ఈ టికెట్ల అమ్మకం విషయంలో బుక్‌మైషోను తిట్టిపోస్తున్నారు. గతంలో పేటియం ఫస్ట్‌లో టికెట్లు బుకింగ్ చేసుకునేటప్పుడు ఇన్ని సమస్యలు రాలేదని, బుక్‌మైషో మేనేజ్‌మెంట్ ఏమాత్రం బాగలేదని మండిపడుతున్నారు. ఆసియా కప్‌లో కూడా భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ టికెట్ల అమ్మకం విషయంలో ఫ్యాన్స్‌కు ఇలాంటి అనుభవాలనే ఎదురవడం కూడా తెలిసిందే.

Story first published: Monday, September 4, 2023, 7:52 [IST]
Other articles published on Sep 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+