Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsNZ: ఒక్క మ్యాచ్‌లో మూడు ప్రపంచ రికార్డులు ఢమాల్!

న్యూజిల్యాండ్‌తో జరిగిన వన్డే వరల్డ్ కప్ సెమీస్ మ్యాచులో టీమిండియా చెలరేగింది. ముఖ్యంగా పేసర్ మహమ్మద్ షమీ 7 వికెట్లతో రాణించాడు. ఈ క్రమంలోనే షమీ ఒక కీలక ప్రదర్శన చేశాడు. వరల్డ్ కప్ సెమీస్‌లో భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.

అంతేకాదు, ఈ మ్యాచులో మూడు వికెట్లు తీయగానే అత్యంత వేగంగా 50 వరల్డ్ కప్ వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా షమీ రికార్డు సృష్టించాడు. షమీ కేవలం 17 ఇన్నింగ్సుల్లోనే 50 వికెట్ల ఘనత అందుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఆ పైన కూడా మరో నాలుగు వికెట్లు తీసుకున్నాడీ స్టార్ బౌలర్.

World Cup 2023 INDvsNZ Team India broke these three world records

ఇక ప్రత్యర్థులకు పెనుసవాల్‌గా మారిన మరో ప్లేయర్ విరాట్ కోహ్లీ. తన కెరీర్‌లో జాగ్రత్తగా ఒక పాత్రకు అంగీకరించి, దాన్ని నిర్వర్తించాలని అనుకుంటున్నాడు. జట్టులో తన పాత్రను చక్కగా నిర్వర్తిస్తున్న అతను.. వికెట్ కోల్పోకుండా మిగతా ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడేందుకు చాలా సహకారం అందిస్తున్నాడు.

ఈ క్రమంలోనే వాంఖడే స్టేడియంలో తన 50వ వన్డే శతకం సాధించాడు. దీంతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ (49) పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించాడు. ఇలా కోహ్లీ అరుదైన ఘనత సాధించడాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.

ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మెగాటోర్నీలో చెలరేగుతున్నాడు. జట్టుకు శుభారంభాలు అందించడమే తన లక్ష్యం అన్నట్లు ధనాధన్ ఇన్నింగ్సులు ఆడుతున్నాడు. తను సెంచరీ, హాఫ్ సాధించాడు. అంతేకాదు, ఈ మ్యాచులో ఎడాపెడా సిక్సర్లు బాదేసిన అతను.. లెజెండరీ క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును కూడా బద్దలు కొట్టాడు.

వన్డే వరల్డ్ కప్‌లో 50పైగా సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్‌గా గేల్ పేరిట రికార్డు ఉండేది. ఇప్పుడు దాన్ని బద్దలు రోహిత్ బద్దలు కొట్టాడు. వన్డే వరల్డ్ కప్‌లలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మూడు కీలక రికార్డులూ ఒకే రోజున బద్దలవడం చూసిన ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.

Story first published: Thursday, November 16, 2023, 8:48 [IST]
Other articles published on Nov 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+