For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Rohit Sharma: భారత్ ఫైనల్ చేరిందని ఏడుపు.. రోహిత్ శర్మపై ‘టాస్ ఫిక్సింగ్’ ఆరోపణలు చేసిన పాకిస్తాన్!

World Cup 2023: వరల్డ్ కప్‌లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో ఓటమి లేకుండా సెమీస్ చేరిన టీమిండియా.. కివీస్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచులో కూడా చెలరేగింది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచులో 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో నాలుగో సారి వరల్డ్ కప్ ఫైనల్‌లో అడుగు పెట్టింది.

అయితే ఇలా భారత్ చెలరేడం చూసిన పాకిస్తాన్ మాజీ ప్లేయర్లు కుళ్లుకొని చస్తున్నారు. తమ జట్టు పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే ఇంటి దారి పట్టడం, భారత్ ఫైనల్ చేరడం చూసి ఏడుస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం వరకు పాక్ మాజీ ప్లేయర్ హసన్ రజా వింత వింత ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

World Cup 2023 INDvsNZ former Pak player says Rohit Sharma is toss fixing

భారత బౌలర్లు వికెట్లు తీయడం కోసం ప్రత్యేకమైన బంతులు ఇస్తున్నారని, పిచ్ కూడా మార్చేస్తున్నారని పిచ్చివాగుడు వాగాడు. ఇప్పుడు ఆ జాబితాలో పాక్ మాజీ బౌలర్ సికందర్ బక్త్ కూడా చేరాడు. తాజగా వరల్డ్ కప్ ఫైనల్‌కు భారత్ చేరడం తట్టుకోలేకపోయిన అతను.. సోషల్ మీడియా వేదికగా మరో కొత్త రకం ఫిక్సింగ్‌ ఆరోపణలు చేశాడు.

మ్యాచ్‌లో ఆటగాళ్లు కాకుండా టీమిండియా ముందుగా టాస్ ఫిక్సింగ్ చేస్తోందని ఆరోపించాడు బక్త్. రోహిత్ శర్మ కావాలనే టాస్ సమయంలో కాయిన్‌ను చాలా దూరం వెళ్లేలా విసురుతున్నాడని, దాంతో పక్కనే ఉండే కెప్టెన్‌కు అది కనిపించదని చెప్పాడు. ఆ టాస్ చూసే అంపైర్ కూడా టీమిండియాకు అనుకూలంగా ఉండే నిర్ణయమే ఇస్తున్నాడని చెప్పాడు.

World Cup 2023 INDvsNZ former Pak player says Rohit Sharma is toss fixing

ఒక పాకిస్తానీ న్యూస్ ఛానెల్‌లో ఇంటర్వ్యూ సందర్భంగా కూడా ఇదే విషయాన్ని సికందర్ వెల్లడించాడు. 'మీరు రోహిత్ శర్మ టాస్ వేసేటప్పుడు చూడండి. తన పక్కన ఉన్న కెప్టెన్‌కు దూరంగా పడేలా కాయిన్ వేస్తాడతను. అది ఎంత దూరం వెళ్తుందంటే.. పక్కన కెప్టెన్ దాదాపుగా ఆ కాయిన్ చూడటం కుదరనంతగా' అన్నాడు.

దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న సికందర్.. 'టాస్ వేసే సమయంలో రోహిత్.. కాయిన్ చాలా దూరం పడేలా విసురుతున్నాడు. ప్రతిసారీ ఇదే చేస్తున్నాడు. మిగతా కెప్టెన్లు ఇలా చేయడం లేదు. దీనికేమైనా ప్రత్యేక కారణం ఉందా?' అని సికందర్ ప్రశ్నించాడు. ఈ మాటలు విన్న ఫ్యాన్స్ మాత్రం.. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నుంచి టాస్ ఫిక్సింగ్ వరకు ఇంకా ఎన్ని ఆరోపణలు చేస్తారు? అని అడుతున్నారు.

Story first published: Thursday, November 16, 2023, 17:07 [IST]
Other articles published on Nov 16, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+