Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: మ్యాచ్ ఈ ఇద్దరి మధ్యనే.. వాళ్లను ఆకాశానికి ఎత్తేస్తున్న ఫ్యాన్స్!

INDvsNZ: వాంఖడే వేదికగా జరిగిన ప్రపంచ కప్ తొలి సెమీఫైనల్‌లో భారత్ జయభేరి మోగించింది. న్యూజిల్యాండ్‌పై 70 పరుగుల తేడాతో విజయం సాధించి, ప్రపంచ కప్ ఫైనల్‌లో అడుగు పెట్టింది. ఇది టీమిండియాకు నాలుగో వరల్డ్ కప్ ఫైనల్ కావడం గమనార్హం. ఈ మ్యాచులో భారత బ్యాటర్లు అందరూ ఆకట్టుకున్నారు.

భారత్ నిర్దేశించిన 398 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ దాదాపు ఛేజ్ చేసినట్లే కనిపించింది. డారియల్ మిచెల్ (134) అద్భుతమైన పోరాట పటిమ చూపించాడు. ఒక పక్క వికెట్లు టపటపా రాలుతున్నా సరే.. మరో ఎండ్ నుంచి జట్టు స్కోరు బోర్డును పరిగెత్తించే పరిగెత్తించాడు. దీంతో అతను క్రీజులో ఉన్నంత సేపూ టీమిండియా ఫ్యాన్స్ టెన్షన్ పడుతూనే ఉన్నారని చెప్పొచ్చు.

World Cup 2023 INDvsNZ Fans say match was between two players

ఇలా కివీస్‌ను గెలిపించేలా కనిపించిన డారియల్ మిచెల్ అవుటయ్యే వరకు టీమిండియా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోలేదు. చివరకు మిచెల్ అవుటై, కివీస్ ఓటమిని ఖరారు చేశాడు. ఈ మ్యాచులో టీమిండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ కూడా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మిగతా బౌలర్లు తడబడుతున్న వేళ తానొక్కడే కీలక వికెట్లు తీస్తూ వచ్చాడు.

చివరకు మ్యాచ్ ముగిసే సరికి ఏడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడీ పేసర్. న్యూజిల్యాండ్ బ్యాటింగ్ లైనప్‌ను ఒంటి చేత్తో తుత్తునియలు చేశాడు. ఒకానొక సమయంలో కివీస్ నాలుగు వికెట్లు పోగొట్టుకొని బ్యాటింగ్ చేస్తుండగా.. ఆ నాలుగు వికెట్లూ తీసింది షమీనే కావడం గమనార్హం. ఇలా అతను చెలరేగడంతో ఫ్యాన్స్‌లో కూడా జోష్ నిండింది.

ఇది 'సెమీఫైనల్' కాదు, 'షమీ ఫైనల్' అంటూ ఫ్యాన్స్ తెగ మెచ్చుకుంటున్నారు. అదే సమయంలో రెండో ఇన్నింగ్సులో షమీ, మిచెల్ మధ్యనే పోటీ నెలకొందని, వీళ్లిద్దరి క్లాష్‌తో జట్ట చేశారు. ఇద్దరూ కూడా తమ స్థాయికి మించిన ప్రదర్శన చేశారని ఫ్యాన్స్ మెచ్చుకోవడం గమనార్హం.

Story first published: Thursday, November 16, 2023, 9:59 [IST]
Other articles published on Nov 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+