నెదర్లాండ్స్‌పై భారీ శతకంతో చెలరేగిన టీమిండియా యంగ్ స్టార్ శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ విషయం చెప్పాడు. వరల్డ్ కప్‌లో అతనికి ఇదే తొలి సెంచరీ. కానీ ఇది సాధించినప్పుడు తను నొప్పితో చాలా బాధపడ్డానని అయ్యర్ చెప్పాడు. గతంలో రెండు, మూడుసార్లు ఇలాగే చక్కగా ఆడుతుండగా తనకు కాళ్లలో కండరాలు పట్టేశాయని అన్నాడు.
దీంతో ఏం జరిగినా ఈ మ్యాచులో వికెట్ పారేసుకోకూడదని డిసైడ్ అయ్యానని చెప్పాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న అనంతరం ఈ విషయాన్ని అయ్యర్ బయటపెట్టాడు. 'నాకు డేజా వూలా అనిపించింది. ఆస్ట్రేలియాతో ఆడే సమయంలో కూడా ఇలాగే జరిగింది. అప్పుడు నా వికెట్ పారేసుకొని రిటర్న్ అయిపోయా. కానీ ఈసారి నాటౌట్‌గా ఉండాలని డిసైడ్ అయ్యా' అని చెప్పాడు.

'ఈ క్రాంప్స్‌కు పిల్స్ తీసుకున్నా. ఈరోజు వరల్డ్ కప్ సెంచరీ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. చివరి మ్యాచుల్లో నేను సాధించిన స్కోర్లు చాలా హెల్ప్ అయ్యాయి. ఈ వికెట్ కొంచెం ట్యాకీగా ఉంది. టూ పేస్‌డ్‌గా కూడా అనిపించింది. అందుకే నాకు దక్కిన ఆరంభాన్ని వదులుకోకూడదని అనుకున్నా. దానిపై ఇన్నింగ్స్ నిర్మించా' అని అన్నాడు.
అయ్యర్, కేఎల్ రాహుల్ ఇద్దరూ కలిసి ఐదో వికెట్‌కు ఏకంగా 208 పరుగులు జతచేశారు. ఈ క్రమంలో శ్రేయాస్.. డౌన్ ది గ్రౌండ్ బాదిన భారీ సిక్సర్లు అందర్నీ అలరించాయి. ఈ షాట్ల కోసం తాను చాలా ప్రాక్టీస్ చేశానని అయ్యర్ తెలిపాడు. 'నా తల కిందకే ఉంచి, బంతిని స్ట్రెయిట్‌గా బాదడానికి ప్రయత్నించా. దీని కోసం చాలా ప్రాక్టీస్ చేశా' అని చెప్పుకొచ్చాడు.
మంచి పొజిషన్‌లోకి వెళ్లడంతోపాటు, షాట్‌ను మధ్యలో ఆపకుండా.. బ్యాటు తన భుజం వెనుక వరకూ వెళ్లేలా ఫాలో త్రూ పెంచుకున్నట్లు అయ్యర్ వివరించాడు. అందుకే ఈ భారీ షాట్లు కుదిరాయని వెల్లడించాడు. తన అద్భుతమైన సెంచరీలో పది ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదిన అయ్యర్.. బెంగళూరు ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడనే చెప్పాలి.