Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Mohammed Siraj: సెమీస్ ముందు ఫ్యాన్స్‌కు భయం.. సిరాజ్‌కు గాయం!

వరల్డ్ కప్‌లో మంచి జోరు మీదున్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. పసికూన నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచులో స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ గాయపడ్డాడు. బాగా ఎత్తుగా గాల్లోకి లేచిన బంతిని అందుకోవడానికి లాంగాన్‌లో ఉన్న సిరాజ్ వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలో బంతి ఎక్కడ పడుతుందో సరిగా డిసైడ్ చేయలేకపోయాడు.

దీంతో సరిగా బ్యాలెన్స్ లేకుండా వెనక్కు వంగి, బంతిని అందుకోవాల్సి వచ్చింది. అయితే బాగా ఎత్తుగా వెళ్లిన ఆ బంతి అతని చేతుల్లో ఆగలేదు. చేతులు జారి నేరుగా వచ్చి అతని గొంతుపై పడింది. దీంతో చాలా ఇబ్బంది పడిన అతను మైదానం వీడాల్సి వచ్చింది. బౌండరీ లైన్ ఆవల చాలాసేపు కూర్చుండిపోయిన అతను.. ఫిజియో చేత చికిత్స్ చేయించుకున్నాడు.

World Cup 2023 INDvsNED Mohammed Siraj injured just befor semifinals

ఆ తర్వాత మళ్లీ మైదానంలోకి వచ్చి అతను బౌలింగ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ తర్వాతి మ్యాచులో అతను ఆడతాడా? లేదా? అనేది అనుమానంగా మారింది. మ్యాచ్ మధ్యలో గాయం అవడంతో మళ్లీ రిటర్న్ వచ్చాడు. కానీ సెమీస్ ముందు తగిలిన ఈ గాయం ఏమాత్రం సీరియస్ అయినా కూడా టీమిండియా బౌలింగ్ విభాగానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి.

బుమ్రాతో కలిసి అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న సిరాజ్.. తొలి పవర్ ప్లేలో టీమిండియాకు బ్రేక్ త్రూ ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. అలాంటి సిరాజ్ కనుక సెమీస్‌లో ఆడకపోతే అది టీమిండియాకు కచ్చితంగా పెద్ద సమస్యే అని చెప్పాలి. మరి సిరాజ్ కోలుకొని సెమీస్ ఆడతాడా? లేకపోతే కివీస్‌తో మ్యాచ్‌కు దూరం అవుతాడా? తెలీదు.

ఈ క్రమంలోనే ఫ్యాన్స్ అంతా తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఒకవేళ సిరాజ్ కనుక ఆడలేకపోతే.. మరోసారి సెమీస్‌లో కివీస్ చేతిలో టీమిండియాకు ఓటమి తప్పదేమో అని భయపడుతున్నారు. అయితే గాయం తగిలిన కాసేపటికే సిరాజ్ మైదానంలోకి వచ్చేయడంతో అలాంటిదేం జరగదని కూడా అనుకుంటున్నారు. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మాత్రం.. టీం మేనేజ్‌మెంట్ ప్రకటన చేసే వరకూ వెయిట్ చేయాల్సిందే.

Story first published: Monday, November 13, 2023, 10:08 [IST]
Other articles published on Nov 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+