Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsNED: ఇంకా ఎన్ని సెంచరీలు మిస్ చేస్తావు నాయనా?.. రోహిత్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం!

బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచులో టీమిండియాకు మంచి ఆరంభం దక్కింది. కెప్టెన్ రోహిత్ శర్మ (61) పరుగులతో రాణించాడు. అతని బ్యాటింగ్ చూసిన వాళ్లంతా కూడా ఈ మ్యాచులో రోహిత్ మరో సెంచరీ సాధిస్తాడని అనుకున్నారు. కానీ రోహిత్ మాత్రం ఆ ఫీట్ సాధించలేదు.

ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటికి పలుసార్లు క్రీజులో కుదురుకున్న తర్వాత అనవసరమైన షాట్లు ఆడిన రోహిత్ పెవిలియన్ చేరాడు. ఇది చూసిన ఫ్యాన్స్ కూడా రోహిత్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి బంతికీ భారీ షాట్ ఆడటం ఎవరి వల్లా కాదని, రోహిత్ అది అర్థం చేసుకొని జాగ్రత్తగా ఆడాల్సిందని అంటున్నారు.

 World Cup 2023 INDvsNED Fans disappointed after Rohit misses another century

ఒక్క ఆఫ్ఘనిస్తాన్‌పై సెంచరీ మినహా మిగతా మ్యాచుల్లో రోహిత్.. ఈ టీంకు అదిరే ఆరంభాలు అందించాడు. వేగంగా హాఫ్ సెంచరీ చేయడం, ఆ తర్వాత అనవసరమైన షాట్ ఆడబోయి పెవిలియన్ చేరడం రోహిత్‌కు అలవాటుగా మారింది. నెదర్లాండ్స్ మీద కూడా ఇదే తరహాలో అతను పెవిలియన్ చేరాడు.

కొంత కాలంగా ఎగ్రెసివ్ క్రికెట్ ఆడటంపై బాగా ఫోకస్ పెట్టిన రోహిత్.. ఈ వరల్డ్ కప్‌లో ఆ విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో 500 పరుగులు చేసినా కూడా అతను కేవలం ఒక్క సెంచరీ మాత్రమే చేయడం గమనార్హం. ఈ టోర్నీ లీగ్ దశలో మూడుసార్లు 40ల్లో అవుటైన రోహిత్, రెండుసార్లు 80ల్లో పెవిలియన్ చేరాడు.

చివరగా ఆడిన ఆరు మ్యాచుల్లో వరుసగా 86, 48, 46, 87, 40, 61 పరుగులు చేశాడు. ఇవన్నీ కూడా అతను సెంచరీ చేసే ఛాన్సులే అని, కానీ రోహిత్ మాత్రం ఏదో చేయబోయి వికెట్ పారేసుకున్నాడని అంటున్నారు. దీంతో వరల్డ్ కప్‌లో సెంచరీ చేసే ఛాన్స్ మిస్ అవుతున్నాడని భావిస్తున్నారు. నెదర్లాండ్స్ మీద అతను అవుటవడం చూసిన రోహిత్ ఫ్యాన్స్ అయితే.. హిట్‌మ్యాన్ ఇలా అవుటవడం చూస్తుంటే ఏడుపొచ్చేస్తోందని అంటున్నారు.

Story first published: Sunday, November 12, 2023, 18:01 [IST]
Other articles published on Nov 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+