Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsENG: బ్లాక్ ఆర్మ్‌బ్యాండ్స్‌తో టీమిండియా.. కారణం ఏంటంటే..!

INDvsENG: ఇంగ్లండ్‌తో జరుగుతున్న కీలక పోరులో టీమిండియా ఆటగాళ్లంతా చేతికి నల్ల ఆర్మ్‌బ్యాండ్స్ ధరించి బరిలోకి దిగారు. అయితే ఈ ఆటగాళ్లు ఈ బ్లాక్ ఆర్మ్‌బ్యాండ్స్ ఎందుకు ధరించారనే విషయంపై ఎక్స్ వేదికగా బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.

లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌ భారత్‌కు చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో కనుక టీమిండియా గెలిస్తే.. ఈ వరల్డ్ కప్‌లో సెమీస్ చేరిన తొలి జట్టుగా భారత్ నిలుస్తుంది. అయితే మ్యాచ్ సందర్భంగా భారత ఆటగాళ్లంతా నల్ల ఆర్మ్ బ్యాండ్స్‌తో కనిపించడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

 World Cup 2023 INDvsENG twhy team india players wearing black armbands

ఈ మధ్యనే టీమిండియా మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ మరణించిన విషయం తెలిసిందే. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అక్టోబర్ 23వ తేదీన ఆయన మరణించారు. ఆయన మృతికి సంతాపంగానే టీమిండియా ఆటగాళ్లు చేతికి నల్ల ఆర్మ్‌బ్యాండ్స్ ధరించినట్లు ఎక్స్‌ వేదికగా బీసీసీఐ వెల్లడించింది.

బిషన్ సింగ్ బేడీ టీమిండియా తరపున 1996 నుంచి 1979 వరకు క్రికెట్ ఆడారు. గొప్ప లెగ్ స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన 67 టెస్టులు, 10 వన్డేలు ఆడి.. 266 టెస్ట్ వికెట్లు, 7 వన్డే వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే 22 టెస్టుల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 370 మ్యాచ్‌లు ఆడిన బేడీ.. 1560 వికెట్లు తీశారు. డొమెస్టిక్ క్రికెట్లో ఇన్ని వికెట్లు పడగొట్టిన ఏకైక బౌలర్‌గా బిషన్ సింగ్ బేడీ రికార్డులకెక్కారు. అలాగే లిస్ట్ ఏ క్రికెట్లో 72 మ్యాచ్‌లు ఆడిన 71 వికెట్లు పడగొట్టారు.

ఇదిలా ఉంటే ఇప్పటివరకు టోర్నీలో ఓటమనేదే లేకుండా దూసుకుపోతున్న టీమిండియా ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి ఇంగ్లండ్‌పై గత వరల్డ్ కప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న ఇంగ్లండ్ జట్టు.. ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఎలాగైనా ఓడించి గెలుపు బాట పట్టాలని పట్టుదలగా ఉంది.

Story first published: Sunday, October 29, 2023, 16:04 [IST]
Other articles published on Oct 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+