Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS: ఈ కారణాలతో ఆసీస్‌పై టీమిండియా గెలుపు ఖాయం..!

World Cup Final: వరల్డ్ కప్‌లో అద్భుతమైన ఫామ్ కనబరిచిన టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్‌లో తలపడేందుకు రెడీ అయ్యాయి. అహ్మదాబాద్‌లోనీ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో ఫైనల్‌లో భారత్ గెలవాలని చాలా మంది అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఆ ఆశలు పెట్టుకున్నారు. దానికి కారణం ఏంటంటే?

వరల్డ్ కప్ ఫామ్: ఈ రెండు జట్లు కూడా అద్భుతమైన ఫామ్‌తో వరల్డ్ కప్ ఫైనల్‌కు దూసుకొచ్చాయి. భారత జట్టు లీగ్ దశలో అన్ని మ్ాచుల్లో ఘనవిజయం సాధించింది. ఓటమి టేకుండానే ఫైనల్ చేరుకుంది. ఇక ఆసీస్ విషయానికొస్తే.. వరుసగా రెండు పరాయజయాలతో టోర్నీ ఆరంభించిందీ టీం.

World Cup 2023 INDvsAUS Team India will win because of these reasons

కానీ ఆ తర్వాత వరుసగా 8 మ్యాచుల్లో ఒక్క ఓటమి లకేకుండా చెలరేగింది. ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అని తెలియయడంతో ఫ్యాన్స్ కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

కంగారూల మిడిలార్డర్: ఈ వరల్డ్ కప్‌లో వరుసగా 8 మ్యాచులు గెలిచినా కూడా ఆసీస్ మిడిలార్డర్ ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఆఫ్ఘన్‌పై డబుల్ సెంచరీ బాదిన మ్యాక్స్‌వెల్ కూడా ఆ తర్వాత పెద్దగా రాణించలేదు.

సౌతాఫ్రికాతో ఇటీవల జరిగిన రెండో సెమీస్‌లో కేవలం ఒక్క పరుగే చేసి పెవిలియన్ చేరాడు. ఓవరాల్‌గా ఆసీస్ మిడిలార్డర్ చాలా పేలవ ఫామ్‌లో ఉంది. వార్నర్, ట్రావిస్ హెడ్ ఇద్దరూ ఫర్వాలేదనిపిస్తున్నారు. మార్ష్ కూడా రాణిస్తున్నాడు. కానీ మిగతా బ్యాటర్లు ప్రభావం చూపడం లేదు.

టీమిండియా వద్ద విరుగుడు: ఆసీస్ ప్రధాన బ్యాటర్లకు సరైన విరుగుడు మన టీమిండియా దగ్గర ఉంది. ఆ టీం మిడిలార్డర్ వైఫల్యాన్ని టీమిండియా స్పిన్నర్లు క్యాష్ చేసుకుంటారు. జడేజా కుల్దీప్ యాదవ్ ఇద్దరూ అద్భుమైన ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ స్మిత్, లబుషేన్ వంటి వాళ్లను తిప్పలు పెడతారు.

అలాగే ఒకవేళ అశ్విన్‌ను జట్టులోకి తీసుకుంటే అతను కూడా ఆసీస్ మిడిలార్డర్ నడ్డివిరుస్తాడు. ఇక ఎడం చేతి వాటం బ్యాటర్లకు షమీ, సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తారు. ఆసీస్ టాపార్డర్‌లో కీలకమైన ఇద్దరు బ్యాటర్లూ లెఫ్ట్ హ్యాండర్లే. కాబట్టి వీళ్లను సిరాజ్, షమీ కూడా ఈజీగా అడ్డుకునే వీలుంది.

Story first published: Sunday, November 19, 2023, 10:15 [IST]
Other articles published on Nov 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+