For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Cup 2023: హైదరాబాద్ ఫ్యాన్స్‌కు షాక్.. ఆ మ్యాచ్ వేదిక మార్చేశారుగా!

వరల్డ్ కప్ ముగిసిన వెంటనే టీమిండియా ఫ్యాన్స్‌కు క్రికెట్ జోష్ తగ్గదు. ఎందుకంటే వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత ఆస్ట్రేలియా, భారత్ మధ్య ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ సిరీసులో వరల్డ్ కప్ ఆడిన సీనియర్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొత్త కుర్రాళ్లకు అవకాశాలు ఇస్తారట. రాజస్థాన్ రయాల్స్ కుర్రాడు రియాన్ పరాగ్‌కు కూడా ఈ సిరీసులో అవకాశం దక్కొచ్చని వార్తలు వస్తున్నాయి

ఈ క్రమంలో ఈ సిరీస్ గురించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. మొత్తం ఐదు టీ20లు జరిగే ఈ సిరీసులో చివరి మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ మ్యాచ్‌ వేదికను మార్చేసినట్లు తెలుస్తోంది. దీన్ని చెన్నైలోని చెపాక్ స్టేడియానికి ఈ మ్యాచ్ మార్చేస్తున్నట్లు అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు.

World Cup 2023 INDvsAUS last t20 moved to Chennai from Hyderabad

అయితే దీనికి ఒక కారణం కూడా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎలక్టన్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. వాటిలో తెలంగాణ కూడా ఒకటి. ఈ క్రమంలోనే మ్యాచ్‌కు పోలీసులు భద్రత కల్పించడం కూడా కష్టమేనని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మ్యాచ్ వేదికను చెన్నైకి షిప్ట్ చేసేశారట.

తెలంగాణలో ఎన్నికల కారణంగానే ఈ మ్యాచ్ వేదికను మారుస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, నవంబరు 30న తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత ఎన్నికల లెక్కింపు డిసెంబరు 3న జరుగుతుంది. ఇక ఆసీస్‌ సిరీసులో హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సమయంలో అతను గాయపడిన సంగతి తెలిసిందే. ఈ గాయం కారణంగా అతను ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఐదు టీ20ల సిరీస్ ముగిసిన వెంటనే.. భారత జట్టు మళ్లీ మరో సిరీస్ ఆడనుంది. దీని కోసం సౌతాఫ్రికా వెళ్లాల్సి ఉంది.

Story first published: Friday, November 10, 2023, 10:27 [IST]
Other articles published on Nov 10, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+