Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS: టీమిండియా టాపార్డర్‌ వర్సెస్ ఈ ఆసీస్ పేసర్.. ఆ ఫైట్ చూడాల్సిందే: గంభీర్

World Cup Final: వరల్డ్ కప్ ఫైనల్‌కు ముహూర్తం ఖరారైంది. భారత్, ఆస్ట్రేలియా జట్లు అద్భుతమైన ఆటతీరుతో సెమీఫైనల్ చేరుకున్నాయి. ఈ క్రమంలో ఫైనల్‌లో ఆసీస్ జట్టు వరుసగా రెండు ఓటములతో ఈ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆస్ట్రేలియా ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. వరుసగా 8 విజయాలతో ఫైనల్‌లో అడుగు పెట్టింది. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్‌పై మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఈ మ్యాచులో కొన్ని కారణాల వల్ల భారత జట్టే విజయం సాధిస్తుందని గౌతమ్ గంభీర్ చెప్పాడు. అయితే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ ఈ మ్యాచ్ ఆరంభంలో ఎలా బౌలింగ్ చేస్తాడో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. ఆసీస్ ఎడం చేతి వాటం పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కొంత మెరుపు తగ్గినా.. హజిల్‌వుడ్ చెలరేగుతున్న సంగతి తెలిసిందే.

World Cup 2023 INDvsAUS Gautam Gambhir wants to see how top order faces Hazlewood

అదే సమయంలో టీమిండియా ఓపెనర్లు, ముఖ్యంగా రోహిత్ శర్మ.. పవర్ ప్లేలో ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ జట్టుకు అదిరే ఆరంభం అందిస్తున్నాడు. ఇలాంటి ఇద్దరు ప్లేయర్ల మధ్య ఎప్పుడూ తమ ట్యాలెంట్ విషయంలో పోటీ ఉంటుందని గంభీర్ అంటున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా టాపార్డర్.. హాజిల్‌వుడ్‌ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలని ఉందన్నాడు.

'ఇండియా టాపార్డర్‌కు హాజిల్‌వుడ్ ఎలా బౌలింగ్ చేస్తాడా? అని ఎదురు చూస్తున్నా. అతను ఈ వరల్డ్ కప్‌లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అలాంటి వాడు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీకి ఎలా బౌలింగ్ చేస్తాడో చూడాలి' అని చెప్పాడు. అలాగే గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా మంచి ఇంపాక్ట్ ఉన్న ఆల్‌రౌండర్ అని కొనియాడాడు. 'ఆసీస్ వద్ద జంపా ఒక్కడే ప్రధాన స్పిన్నర్. దీంతో మ్యాక్స్‌వెల్‌పై ఒత్తిడి ఉంటుంది. అయినా సరే రాణించాడంటే మ్యాక్సీ సూపర్' అని గంభీర్ చెప్పాడు.

Story first published: Sunday, November 19, 2023, 12:18 [IST]
Other articles published on Nov 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+