Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAFG: అందుకే అశ్విన్‌ను పక్కనపెట్టి అతన్ని తీసుకున్నాం: రోహిత్ శర్మ

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్ కోసం టీమిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ వేదికగా జరిగే ఈ మ్యాచులో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను పక్కన పెట్టేసినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాుడ. అశ్విన్ స్థానంలో పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు చెప్పాడు. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఈ వరల్డ్ కప్‌లో తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన టీమిండియా ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి తమ జోరు కొనసాగించాలని భావిస్తోంది. అదే సమయంలో మొదటి మ్యాచులో బంగ్లా చేతిలో ఓడిన ఆఫ్ఘనిస్తాన్.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టీమిండియాకు షాక్ ఇవ్వాలని అనుకుంటోంది. అలాగే ఈ మెగా టోర్నీలో బోణీ కొట్టాలని కూడా ఉవ్విళ్లూరుతోంది.

 World cup 2023 INDvsAFG Rohit takes key decision and leaves out Ashwin

ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ఎందుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించేలా ఉందని, అందువల్ల తమ బ్యాటర్లు రాణించి మంచి స్కోరు నమోదు చేయగలిగితే భారత్‌పై ఒత్తిడి పెంచగలుగుతామని, మ్యాచ్‌ను తమవైపు తిప్పుకోగలుగుతామని ఆఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ అన్నాడు. అలాగే తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని, బంగ్లాతో ఆడిన అదే జట్టుతో బరిలోకి దిగుతున్నామని వివరించాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. రెండో ఇన్నింగ్స్ సమయానికి పిచ్‌లో పెద్దగా మార్పు రాకపోవచ్చని, తమ బౌలర్లు బాగా బౌలింగ్ చేసి ఆఫ్ఘన్ బ్యాటర్లను తక్కువ స్కోరుకు అవుట్ చేయగలిగితే తాము గెలిచే అవకాశాలు పెరుగుతాయని అన్నాడు. అలాగే ప్రాక్టీస్ సమయంలో మంచు ప్రభావం చూశామని, కాబట్టి టాస్ గెలిచినా కూడా ముందుగా బౌలింగ్ చేయాలనే అనుకున్నట్లు వెల్లడించాడు.

భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఆఫ్ఘన్ జట్టు:
రహ్మనుల్లా గుర్జాబ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహమాన్, ఫజల్హక్ ఫరూఖీ, నవీన్-ఉల్-హక్.

Story first published: Wednesday, October 11, 2023, 14:58 [IST]
Other articles published on Oct 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+