Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇషాన్ కిషన్‌కు అనుకోని అదృష్టం: నిలుపుకొంటాడా? నేలపాలు చేసుకుంటాడా?

చెన్నై: ఐసీసీ ప్రపంచ కప్ 2023లో భారత జట్టు బోణీ కొట్టింది. చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఆరు వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన ఓ మోస్తరు లక్ష్యాన్ని 41.2 ఓవర్లల్లో ఛేదించింది. కేఎల్ రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

బుధవారం తన రెండో మ్యాచ్ ఆడబోతోంది టీమిండియా. ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం దీనికి వేదిక. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే ఢిల్లీకి చేరుకుంది టీమ్. జోరుగా నెట్ ప్రాక్టీస్ సాగిస్తోంది. నెట్స్‌లో ప్లేయర్లు చెమటోడుస్తోన్నారు.

Ishan Kishan to continue against PakistanonOctober14

దీని తరువాత పాకిస్తాన్‌ను ఢీకొట్టాల్సి ఉంది టీమిండియాకు. ఈ నెల 14వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో షెడ్యూల్ అయిన మ్యాచ్ ఇది. ప్రస్తుతం క్రికెట్ అభిమానుల దృష్టి అంతా దీనిమీదే ఉంది. మొన్నటికి మొన్న ఆసియాకప్‌లో టీమిండియా చేతిలో చావుదెబ్బలు తిన్న అనుభవం ఉన్నందున పాకిస్తాన్ జట్టు భారత్‌పై ఎలా ఆడుతుందనేది ఆసక్తి రేపుతోంది.

ఈ పరిస్థితుల్లో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. డాషింగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. ఆసుపత్రి పాలయ్యాడు. కొద్దిరోజులుగా డెంగ్యూ ఫీవర్‌తో అతను బాధపడుతున్నాడు. జ్వర తీవ్రత మరింత పెరగడంతో చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. బీసీసీఐ డాక్టర్ రిజ్వాన్ ఖాన్ పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్ తీసుకుంటోన్నాడు.

పాకిస్తాన్‌తో ఇంకో నాలుగు రోజుల వ్యవధిలో జరగబోయే మ్యాచ్‌ నాటికి శుభ్‌మన్ గిల్ అందుబాటులోకి రాకపోవచ్చని తెలుస్తోంది. డెంగ్యూ తీవ్రత తగ్గినప్పటికీ.. విశ్రాంతి తీసుకోవాల్సి ఉన్నందున పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కు తుదిజట్టులో అతనికి చోటు దక్కకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి.

దీనితో- శుభ్‌మన్ గిల్ స్థానంలో తుదిజట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను కొనసాగించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లోనూ అతన్ని ఆడించవచ్చు జట్టు మేనేజ్‌మెంట్. రోహిత్ శర్మతో పాటు అతను ఇన్నింగ్‌ను ఆరంభించవచ్చు.

ఆస్ట్రేలియాపై గోల్డెన్ డక్ నమోదు చేశారు ఇషాన్ కిషన్. ఎదుర్కొన్న తొలి బంతికే స్లిప్స్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడీ లెఫ్ట్ హ్యాండర్. అతని మీద పెద్ద ఎత్తున జోకులు పేలాయి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై. గిల్ అందుబాటులో ఉండి ఉంటే కిషన్‌కు అవకాశం దక్కేది కాదనడంలో సందేహాలు అక్కర్లేదు.

గిల్ ఆసుపత్రిపాలు కావడం వల్ల అనుకోని విధంగా లభించిన ఈ అవకాశాన్ని ఇషాన్ కిషన్ ఎలా ఉపయోగించుకుంటాడనేది ఆసక్తి రేపుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్ ఆడగలిగితే ఆ తరువాతి మ్యాచ్‌లల్లోనూ అతనిపైనే డిపెండ్ అవుతుంది జట్టు మేనేజ్‌మెంట్. విఫలమైతే మాత్రం ఆల్టర్నేటివ్‌ను వెదుక్కోక తప్పదు.

Story first published: Tuesday, October 10, 2023, 12:07 [IST]
Other articles published on Oct 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+