For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs PAK: బాబర్ ఆజమ్‌కు ఆ షాట్ అంటే ఇష్టమట: బ్యాటింగ్‌లో ఆ లెజెండ్‌కు కాపీ..!!

అహ్మదాబాద్: ప్రపంచ కప్ 202లో భాగంగా భారత్- పాకిస్తాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ ఇంకొన్ని గంటల్లో మొదలు కాబోతోంది. ఈ మధ్యాహ్నం గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుంది. మ్యాచ్‌కు మించి అనిపించేలా జరిగే ఈ పోరులో విజయం సాధించడానికి రెండు జట్లు సన్నద్ధం అయ్యాయి.

వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌పై భారత్‌కు ఓ అరుదైన రికార్డ్ ఉంది. ఇప్పటివరకు వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో ఒక్కసారి కూడా పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓడిపోలేదు. అన్ని మ్యాచ్‌లల్లోనూ విజయఢంకా మోగించింది. వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు ఏడుసార్లు ఈ రెండు జట్లు తలపడగా.. అన్నిసార్లూ భారత్‌దే పైచేయి అయింది.

 World Cup 2023, IND vs PAK: Babar Azam reveal what shots he loves playing the most

ఇప్పుడా రికార్డును కాపాడుకుంటుందా?, టీమిండియాపై ఈ వరస్ట్ రికార్డ్‌ను పాకిస్తాన్ కొనసాగిస్తుందా? అనేది ఆసక్తి రేపుతోంది. 7-1గా మారుతుందా? లేక 8-0గా భారత్ ఆధిపత్యం కొనసాగుతుందా? అనేది ఈ రాత్రికి తేలిపోతుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు తమ ప్రత్యర్థులను ఓడించిన తీరు చూస్తోంటే మరోసారి భారత్ గెలుపు ఖాయమే.

భారత్‌తో ఈ స్థాయి హైఓల్టేజ్ మ్యాచ్‌కు ముందు- బాబర్ ఆజమ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ అంటే తనకు ఉన్న ఇష్టాన్ని వ్యక్తం చేశాడు. చిన్నప్పుడు ప్రతిరోజూ క్రికెట్ ఆడేవాడినని చెప్పుకొచ్చాడు. చదువుకోవడానికంటే క్రికెట్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చేవాడినని పేర్కొన్నాడు. గల్లీ క్రికెట్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని వ్యాఖ్యానించాడు బాబర్.

దక్షిణాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ తన రోల్ మోడల్‌గా అభివర్ణించాడు బాబర్ ఆజమ్. అతని బ్యాటింగ్ స్టైల్‌ను కాపీ కొట్టడానికి ప్రయత్నించానని చెప్పాడు. ఏబీ వీడియోలను చూసేవాడినని, అతని షాట్లను కాపీ చేశాననీ తేల్చి చెప్పాడు. కవర్ డ్రైవ్ తనకు ఇష్టమైన ఫేవరెట్ షాట్‌ అని వివరించాడు. అయినప్పటికీ- స్ట్రెయిట్ డ్రైవ్‌ను మరింత టెక్నిక్‌గా ఆడగలుగుతానని చెప్పుకొచ్చాడు.

కవర్ డ్రైవ్ తన ఫేవరెట్ షాట్ అయినప్పటికీ- అందులో తనకు ఆ స్థాయి టెక్నిక్ లేదని ఒప్పుకొన్నాడు బాబర్. స్ట్రెయిట్ డ్రైవ్‌ ఆడటంలో బ్యాలెన్స్ అవసరమౌతుందని, దీన్ని ఎక్కువగా ఆడుతుంటానని పేర్కొన్నాడు. బౌలర్ చేతి నుంచి వెలువడిన ప్రతి బంతినీ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడలేమని, దాని కోసం మంచి బంతులనే ఎంచుకోవాల్సి ఉంటుందని అన్నాడు.

Story first published: Saturday, October 14, 2023, 11:12 [IST]
Other articles published on Oct 14, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+