INDvsENG: డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ దారుణమైన ఓటమి చవిచూసింది. అన్ని విభాగాల్లో అదరగొట్టిన భారత జట్టు ఏకంగా 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇలా భారత్ గెలవడం చూసిన పాకిస్తాన్ ఫ్యాన్స్.. టీమిండియాకు థ్యాంక్స్ చెప్తున్నారు. ఎందుకంటే టీమిండియా గెలవడం వల్ల పాకిస్తాన్‌కు లాభం జరిగింది.
భారత్ చేతిలో ఓడిన ఇంగ్లండ్ జట్టు.. ఇంకా మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ మూడింటా ఇంగ్లండ్ నెగ్గినా కూడా ఆ టీం మ్యాగ్జిమమ్ 8 పాయింట్లు మాత్రమే సాధిస్తుంది. దానికితోడు వాళ్ల నెట్ రన్ రేట్ కూడా దారుణంగా పడిపోయింది. భారత్ కన్నా ముందు శ్రీలంక చేతిలో కూడా ఇంగ్లండ్ దారుణమైన ఓటమి మూటగట్టుకున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు భారత్ చేతిలో ఓడటంతో.. ఇంగ్లండ్ దాదాపుగా సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. ఇప్పటికే న్యూజిల్యాండ్, భారత్, సౌతాఫ్రికా జట్లు దాదాపుగా సెమీస్‌కు చేరుకున్నాయి. చివరిదైన నాలుగో స్థానం కోసం ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఇంగ్లండ్ తదితర జట్లు పోటీ పడుతున్నాయి. ఇప్పుడు ఇంగ్లండ్.. భారత్ చేతిలో ఓడింది.
దీంతో తమ మిగతా మూడు మ్యాచులు గెలిచినా కూడా ఇంగ్లండ్ మ్యాగ్జిమమ్ 8 పాయింట్లకే చేరుతుంది. దానికితోడు సెమీస్ చేరాలంటే పాయింట్లతోపాటు నెట్ రన్ రేట్ కూడా మెరుగ్గా ఉండాలి. అదే సమయంలో పాకిస్తాన్ ఇప్పటి వరకు రెండు విజయాలు నమోదు చేసింది. ఇంకా మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది.
అంటే పాక్ కనుక తమ చివరి మూడు మ్యాచులు గెలిస్తే ఆ టీం 10 పాయింట్లు సాధిస్తుంది. అంటే ఇంగ్లండ్ కన్నా ఒక రెండు పాయింట్లు మెరుగ్గా ఉంటుందన్నమాట. అదే జరిగితే ఇంగ్లండ్ కన్నా సెమీస్ చేరే అవకాశాలు పాకిస్తాన్‌కు మెరుగ్గా ఉన్నట్లే. అందుకే ఇంగ్లండ్‌ను ఓడించినందుకు భారత జట్టుకు పాకిస్తానీలు కూడా థ్యాంక్స్ చెప్తున్నారు.