Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: ఇదే టీంను ధోనీకి ఇవ్వండి.. ఎన్ని కావాలంటే అన్న వరల్డ్ కప్‌లు కొడతాడు!

వరల్డ్ కప్‌లో పేలవ ఫామ్‌లో ఉన్న టీమ్స్‌లో పాకిస్తాన్ ఒకటి. ఈ మెగా టోర్నీ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగిన పాకిస్తాన్.. అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. ఇప్పుడు ఆల్‌మోస్ట్ సెమీస్ రేసు నుంచి తప్పుకుంది కూడా. ఈ క్రమంలో ఈ టీం ప్రదర్శనపై, ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టీమిండియా మాజీ ప్లేయర్ మనోజ్ తివారీ కూడా ఈ టీంను తిట్టిపోశాడు.

చూడటానికి పాక్ జట్టు చాలా బలంగా ఉందని తివారీ అన్నాడు. కానీ కెప్టెన్సీ వ్యూహాలు మాత్రం ఏమాత్రం బాగలేవని బాబర్‌ను విమర్శించాడు. 'ఇదే పాకిస్తాన టీంకు ఎంఎస్ ధోనీని కెప్టెన్ చేయండి. ఈ టీం వరుస విజయాలతో దూసుకెళ్తుందని నేను ఛాలెంజ్ చేస్తా. నన్నడిగితే కెప్టెన్‌గా బాబర్ ఇంకా మెరుగ్గా రాణించాల్సింది. అతను ప్రత్యర్థి కన్నా ఒకడుగు ముందే ఆలోచించాలి' అని తివారీ చెప్పాడు.

World Cup 2023 If MS Dhoni is captain Pak would have won World Cup

'ఒక ఉదాహరణ చెప్తా చూడండి. షాదాబ్ తన రిథమ్ అందుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. అయినా సరే బాబర్ మాత్రం అతన్ని కొనసాగిస్తూనే వచ్చాడు. రాణించలేనప్పుడు ఇలా స్ట్రగుల్ అవుతున్న ప్లేయర్‌ను పక్కన పెట్టేయడమే మంచిది' అని సూచించాడు. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో బాబర్ కెప్టెన్సీలో పాకిస్తాన్ ఫైనల్ వరకూ వెళ్లింది. అయినా సరే బాబర్ కెప్టెన్సీపై విమర్శలు మాత్రం తగ్గలేదు.

అంతకుముందు ఆసియా కప్ నుంచే బాబర్ కెప్టెన్సీని చాలా మంది తప్పుబడుతూ వచ్చారు. ఈ వరల్డ్ కప్ ముందు జరిగిన ఆసియా కప్‌లో సూపర్-4 దశలో పాకిస్తాన్ చివరి స్థానంలో టోర్నీ ముగించింది. ఇక ఈ వరల్డ్ కప్‌లో కూడా ఏమాత్రం నిలకడలేకుండా ఆడింది. చిన్న దేశాలపై విజయాలు సాధించినా.. పెద్ద దేశాల ముందు తడబడింది. దీంతో విమర్శలు మరీ ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమి తర్వాత పాక్ జట్టుపై పలువురు మాజీలు, ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Story first published: Friday, November 10, 2023, 13:51 [IST]
Other articles published on Nov 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+