Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బాబర్‌కు ఫుల్ సపోర్ట్ ఇచ్చిన హైదరాబాద్!

వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచులో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు హైదరాబాద్ ప్రేక్షకులు తెగ సపోర్ట్ చేశారు. ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బాబర్ సేనకు అనుకున్న ఆరంభం దక్కలేదు. నెదర్లాండ్స్ బౌలింగ్ ధాటికి పాక్ టాపార్డర్ కుప్పకూలింది.

అయితే మహమ్మద్ రిజ్వాన్ (68), సౌద్ షకీల్ (68) చూడచక్కని ఇన్నింగ్సులతో ఆకట్టుకున్నారు. చివర్లో షాదాబ్ ఖాన్ (32), మహమ్మద్ నవాజ్ (39) కూడా ఫర్వాలేదనిపించారు. దీంతో పాకిస్తాన్ 285 పరుగుల స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ తడపడింది. ఆల్‌రౌండర్ బాస్ డి లీడ్స్ (67) గట్టిగా పోరాడాడు.

World Cup 2023 Hyderabad crowd chan Babar name in full support

ఓపెనర్ విక్రమ్ జీత్ సింగ్ (52) కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కానీ చివరకు ఈ జట్టు 205 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 81 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచిన పాకిస్తాన్ మంచి మూడ్‌లో ఉన్నట్లు కనిపించింది. ఈ మ్యాచులో బాబర్ ఆజమ్ బ్యాటుతో విఫలమయ్యాడు.

ఈ మ్యాచులో నెదర్లాండ్స్ బ్యాటింగ్ చేస్తుండగా బాబర్ ఆజమ్.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న ఫ్యాన్స్ అంతా కలిసి 'బాబర్.. బాబర్..' అంటూ అందరికీ బాబ్ర్ ధన్యవాదాలు తెలియజేశాడు. మ్యాచ్ అనంతరం కూడా తమకు ఇంత గొప్ప మద్దతు లభించడాన్ని బాబర్ మెచ్చుకున్నాడు.

'మమ్మల్ని హైదరాబాద్ సపోర్ట్ చేసిన విధానం చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఈ విజయంతో బాగా శాటిస్ఫై అయ్యాను. మా బౌలర్లు బాగా రాణించారు. మేం మ్యాచ్ బాగానే మొదలు పెట్టాం. మిడిల్ ఓవర్లలో వారిపై ఒత్తిడి పెట్టి వికెట్లు తీసుకున్నాం. సౌద్ ఆటలో తనను తాను బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు' అని మెచ్చుకున్నాడు.

ఫ్యాన్స్ కూడా ప్రపంచ క్రికెట్‌లోని స్టార్స్‌లో ఒకడైన బాబర్‌ను కిలిసేందుకు మంచి ఉత్సాహం చూపించారు. ఇలా హైదరాబాద్ స్టేడియం మొత్తాన్ని తమ అరుపులతో ముంచేస్తూ బాబర్‌కు సపోర్ట్ చూపించారు. బాబర్ కూడా ఇదంతా చూసి తెగ సంతోషించినట్లే కనిపిస్తున్నాడు.

Story first published: Saturday, October 7, 2023, 8:15 [IST]
Other articles published on Oct 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+