Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: వరల్డ్ కప్‌తో అన్ని దేశాలకూ కాసుల పంటే.. ఒక్కో దేశానికి ఎంత వస్తుందంటే?

అతిపెద్ద క్రికెట్ వేడుక వరల్డ్ కప్‌కు అంతా రెడీ అయింది. మరికొన్ని రోజుల్లో అసలు సిసలు క్రికెట్ సమరం మొదలవుతుంది. దాని కన్నా ముందు వార్మప్ మ్యాచుల కోసం కూడా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఈ మెగా క్రికెట్ పండుగ ద్వారా అత్యధికంగా లాభాలు చూసే దేశాలు ఏవని చాలామందికి అనుమానం వచ్చి ఉంటుంది.

తాజాగా తెలిసిన లెక్కల ప్రకారం చూసుకుంటే.. ఈ వరల్డ్ కప్ వల్ల దాదాపు అన్ని క్రికెట్ దేశాల ఆర్థిక వ్యవస్థలకు భారీగానే లాభాలు చేకూరనున్నాయి. ఐసీసీ చెప్పిన గణాంకాల ప్రకారం ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ దేశాల్లో కలిపి ఆల్‌మోస్ట్ రూ.2,887 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. అంటే ఆ దేశ ఎకానమీల్లో ఇంత డబ్బు చేరుతుందని అంచనా.

World Cup 2023 how much will each country earn with the marquee event

అదే ఇంగ్లండ్ ఆర్థిక వ్యవస్థకు ఏకంగా రూ.3727 కోట్ల డబ్బు చేరుతుందని తెలుస్తోంది. అయితే అన్ని దేశాల కన్నా ఎక్కువగా ఆతిథ్య దేశమైన భారత్‌కే ఎక్కువ డబ్బు వస్తుందట. ఈ మెగా టోర్నీ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థలో ఏకంగా రూ.13,318 కోట్ల రూపాయలు చేరతాయట. ఈ లెక్కలు చూస్తేనే క్రికెట్ మార్కెట్ ఎంతగా అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు.

ఇక టోర్నీ విషయానికొస్తే ఓవరాల్‌గా పది మిలియర్ డాలర్ల బడ్జెట్‌తో వరల్డ్ కప్ మొదలవుతుంది. వీటిలో విజేతలకు ఏకంగా 4 మిలియలన్ డాలర్లు దక్కుతాయి. ఇక రన్నరప్‌గా నిలిచిన టీంకు 2 మిలియన్ డాలర్లు, అలాగే సెమీఫైనల్స్‌లో ఓడిన రెండు జట్లకు తలో 1.6 మిలియన్ డాలర్లు అందజేస్తారట.

అక్టోబర్ 5న మొదలయ్యే ఈ మెగాటోర్నీ తొలి మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది. గత వరల్డ్ కప్ ఫైనలిస్టులు ఇంగ్లండ్, న్యూజిల్యాండ్ ఈ మ్యాచులో తలపడతాయి. ఇక క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎదరు చూస్తున్న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఇదే స్టేడియంలో అక్టోబర్ 14న జరుగుతుంది.

Story first published: Friday, September 29, 2023, 10:10 [IST]
Other articles published on Sep 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+