Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World cup 2023 సెంచరీల సునామీ.. 10 మ్యాచ్‌ల్లోనే ఇన్ని సెంచరీలా..!

వన్దే వరల్డ్ కప్ 2023లో సెంచరీల వర్షం కురుస్తోంది. స్టార్ బ్యాటర్లంతా ఒకరి తర్వాత ఒకరుగా చెలరేగి ఆడుతున్నారు. మైదానంలో బౌండరీల మోత మోగిస్తూ ప్రత్యర్థుల బౌలింగ్‌ను ఊచకోత కోస్తున్నారు. దీంతో వరల్డ్‌ కప్‌లో ఇప్పటివరకు జరిగిన 10 మ్యాచ్‌ల్లో ఏకంగా 12 సెంచరీలు నమోదయ్యాయి. వరల్డ్ కప్ చరిత్రలోనే ఇదో రికార్డ్ కూడా.

అక్టోబర్ 5న వన్డే వరల్డ్ కప్‌ తొలి మ్యాచ్‌ జరిగింది. ఇంగ్లండ్, న్యూజిల్యాండ్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లోతోనే సెంచరీల వరద మొదలైంది. ఇంగ్లండ్ ఇచ్చిన 283 పరుగుల టార్గెట్‌ను న్యూజిల్యాండ్ జట్టు 36.2 ఓవర్లలోనే ఛేదించింది. కివీస్ బ్యాటర్లు డెవాన్ కాన్వాయ్ (152*), రచిన్ రవీంద్ర (123*) ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఉతికారేశారు.

World cup 2023 How many centuries smashed in CWC 2023 so far

ఆ తర్వాత శ్రీలంక, సౌతాఫ్రికా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సౌత్‌ఆఫ్రికా బ్యాటర్లు ఏకంగా 3 సెంచరీలు బాదేశారు. క్వింటన్ డీకాక్ (100), వ్యాన్ డెర్ డస్సెన్ (108), మార్క్రమ్ (106) వీరవిహారం చేయడంతో ప్రొటీస్ జట్టు ఏకంగా 428 పరుగుల భారీ స్కోర్‌ బాది మ్యాచ్‌ను వరల్డ్ కప్‌ చరిత్రలో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా రికార్డులకెక్కింది.

ఇక ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఇంగ్లీష్ డేవిడ్ మలాన్ (140)సెంచరీతో మెరిశాడు. ఆ తర్వాత మళ్లీ శ్రీలంక, పాకిస్తాన్ మ్యాచ్‌లో శతకాల వరద పారింది. కుశాల్ మెండిస్ (122), సదీర సమర విక్రమ (108) చెరో సెంచరీ బాది మెరుపు ఆరంభాన్నిచ్చారు. అయితే ఛేజింగ్‌లో పాకిస్తాన్ బ్యాటర్లు అబ్దుల్లా షఫీక్ (113), వికెట్ కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ (131*) చెలరేగి జట్టుకు విజయాన్నందించారు.

తాజాగా ఆఫ్ఘన్‌తో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (131) కూడా ఈ టోర్నీలో తొలి సెంచరీ బాదేశాడు. ఇక గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డీకాక్ (109) మళ్లీ సెంచరీ బాదేశాడు. ఈ సీజన్లో డీకాక్‌కి ఇది రెండో సెంచరీ.

అంటే ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు జరిగిన 10 మ్యాచ్‌ల్లో ఏకంగా 12 సెంచరీలు నమోదయ్యాయన్నమాట. ఇలాగే ప్రతి మ్యాచ్‌లో సెంచరీల వర్షం కురుస్తుంటే మరి సీజన్ ముగిసే సమయానికి ఇంకెన్ని సెంచరీలు నమోదవుతాయో చూడాలి. అలాగే అందులో భారత బ్యాటర్లు ఎన్ని శతకాలు బాదుతారో మరి.

Story first published: Friday, October 13, 2023, 14:59 [IST]
Other articles published on Oct 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+