Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: భారత్, పాక్ సెమీస్‌లో తలపడాలంటే ఎలా?.. ఏం జరిగితే ఫ్యాన్స్ కోరిక తీరుతుంది?

వరల్డ్ కప్‌లో ఓటమి లేకుండా సెమీస్‌కు దూసుకొచ్చిన టీమిండియా.. తమ చివరి లీగ్ మ్యాచ్‌ కోసం రెడీ అవుతోంది. నెదర్లాండ్స్‌తో మ్యాచ్ అనంతరం సెమీస్‌లోనే భారత్ ఆడుతుంది. అయితే సెమీఫైనల్‌లో భారత జట్టు ప్రత్యర్థి ఎవరు? అని ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది. పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. కాబట్టి నాలుగో స్థానంలో ఉన్న జట్టుతో సెమీఫైనల్‌లో తలపడుతుంది.

ప్రస్తుతం ఈ నాలుగో ప్లేస్ కోసం న్యూజిల్యాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. మరి భారత్, పాకిస్తాన్ మధ్య సెమీఫైనల్ చూడాలంటే ఏం జరగాలి? అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. తమ తర్వాతి మ్యాచులో శ్రీలంక చేతిలో కనుక న్యూజిల్యాండ్ ఓడిపోయి, ఇంగ్లండ్‌పై పాకిస్తాన్ గెలిస్తే.. పాక్ పాయింట్లు 10కి చేరతాయి. అప్పటికి కివీస్ వద్ద కేవలం 8 పాయింట్లే ఉంటాయి.

World Cup 2023 How can we see INDvsPAK semifinal clash

అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడాల్సి ఉన్న సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు గెలవాలి. అప్పుడు ఆఫ్ఘన్ పాయింట్ల సంఖ్య 10కి చేరుకోవడం అసాధ్యంగా మారుతుంది. దీంతో నాలుగో స్థానం కోసం ఫైట్ పెద్దది అయినా కూడా.. సెమీస్‌లో అభిమానులు ఆశించే భారత్, పాకిస్తాన్ జట్లే తలపడతాయి.

ఇక మరో మార్గం ఏంటంటే.. శ్రీలంకపై న్యూజిల్యాండ్ గెలిచిందనుకుందాం. అప్పుడు ఇంగ్లండ్‌పై పాకిస్తాన్ భారీ విజయం సాధించాలి. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ మాత్రం తన రెండు మ్యాచుల్లో ఓటమి చవిచూడాలి. అప్పుడు నాలుగో సెమీస్ స్థానం కోసం న్యూజిల్యాండ్, పాకిస్తాన్ మధ్య పోటీ నెలకొంటుంది. ఈ రెండు టీమ్స్‌లో నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న జట్టు ఆ స్థానం సంం

భారత్, పాక్ సెమీస్ జరగడానికి మరో మార్గం కూడా ఉంది. అదేంటంటే.. కివీస్, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్ వర్షార్పణం అవ్వాలి. ఒక వేళ ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దయి, ఇంగ్లండ్‌పై పాకిస్తా గెలవాలి. అప్పుడు కివీస్ వద్ద 9 పాయింట్లు ఉండగా.. పాక్ వద్ద పది పాయిట్లు ఉంటాయి. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ కనుక తన రెండు మ్యాచుల్లో ఒకటి గెలిచినా... సెమీస్ బెర్తు కోసం పాక్‌తో తలపడుతుంది. అప్పుడు ఈ రెండింటి మధ్య సెమీస్ బెర్తు కోసం పోటీ ఉంటుంది.

ఒకవేళ పాకిస్తాన్, న్యూజిల్యాండ్ రెండు జట్లు ఆడాల్సిన చివరి లీగ్ మ్యాచులకు వర్షం అంతరాయం కలిగిస్తే.. అప్పుడు ఈ రెండు టీమ్స్ 8 పాయింట్లతో ఉంటాయి. ఈ టైంలో ఆఫ్ఘనిస్తాన్ కనుక తను ఆడే రెండింటిలో ఒకటి గెలిచినా.. ఆ టీం సెమీస్ చేరుతుంది. కానీ సఫారీలు, కంగారూలను ఓడించడం ఆఫ్ఘన్‌కు కష్టమే. కాబట్టి పాక్, కివీస్ ఆడే మ్యాచులు రద్దయితే.. ఈ రెండు టీమ్స్‌లో మెరుగైన రన్ రేట్ ఉన్న జట్టే ఫైనల్ చేరుతుంది.

Story first published: Tuesday, November 7, 2023, 12:10 [IST]
Other articles published on Nov 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+