Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా సక్సెస్ సీక్రెట్ అదే.. అసలు విషయం చెప్పేసిన హార్దిక్ పాండ్యా!

ఈ వరల్డ్ కప్‌లో మంచి జోరు మీదున్న జట్లలో టీమిండియా ఒకటి. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ భారత్ విజయాలు నమోదు చేసింది. ఆడిన మొదటి మ్యాచులో ఆస్ట్రేలియాపై ఉత్కంఠ భరిత విజయం సాధించిన భారత్.. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ టీమ్స్‌ను చిత్తుగా ఓడించింది. ఈ క్రమంలో టీం సక్సెస్ మంత్ర ఏంటో వెల్లడించాడు.

ఇలా మూడు వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిందీ జట్టు. ఈ క్రమంలోనే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఇటీవల మాట్లాడుతూ టోర్నీలో తమ సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పేశాడు. ప్రతి మ్యాచ్ ఆడే ముందు జట్టులోని 11 మంది సభ్యులకు తమ చిన్ననాటి ఫొటోలను టీం మేనేజ్‌మెంట్ చూపిస్తోందట. డ్రెస్సింగ్ రూం వాతావరణం చాలా సరదాగా ఉందని వెల్లడించాడు.

World Cup 2023 Hardik Pandya reveals Team Indias success secret

'డ్రెస్సింగ్ రూంలో మా ప్లేయింగ్ ఎలెవన్ జట్టును చూపించే సమయంలో.. వాళ్ల చిన్ననాటి ఫొటోలు, గతంలోని ఫొటోలు, ఇప్పటి ఫొటోలు కలిపి చూపిస్తున్నారు. మా డ్రెస్సింగ్ రూం వాతావరణం చాలా సరదాగా, తేలికగా ఉంది. మేమంతా కలిసి ఒక జట్టులా ఆడుతున్నాం' అని పాండ్యా వివరించాడు. అయితే ఈ టోర్నీలో పాండ్యాకు బ్యాటింగ్ చేసే అవకాశం పెద్దగా రాలేదు.

ఆసీస్‌తో జరిగిన తొలి మ్యాచులో మాత్రమే బ్యాటింగ్ చేసిన అతను 8 బంతుల్లో 11 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక ఆఫ్ఘన్, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచుల్లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. అదే సమయంలో బంతితో మాత్రం పాండ్యా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లో కలిపి 6.56 ఎకానమీతో ఐదు వికెట్లు తీసుకున్నాడు.

ఇక పూణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచులో కూడా పాండ్యా ఇదే జోరు కొనసాగించాలని అందరూ కోరుకుంటున్నారు. ఇటీవలి కాలంలో భారత్‌ను బాగా ఇబ్బంది పెట్టిన జట్లలో బంగ్లా ముందు వరుసలో ఉంటుంది. ఆసియా కప్‌లో కూడా అన్ని జట్లను ఓడించిన భారత్.. బంగ్లాను మాత్రం ఓడించలేకపోయింది. మరి ఆ పరాజయానికి వరల్డ్ కప్‌లో పగ తీర్చుకుంటుందేమో చూడాలి.

Story first published: Thursday, October 19, 2023, 8:11 [IST]
Other articles published on Oct 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+