పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో బాల్‌పై పాండ్యా ఏదో మంత్రం వేస్తున్నట్లున్న వీడియో రెండు రోజులుగా తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వాళ్లంతా పాండ్యా ఏదో మంత్రం వేసి ఇమామ్‌ను అవుట్ చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఈ వీడియో వెనకున్న సీక్రెట్‌ను హార్దిక్ బయటపెట్టాడు.
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌ను 13వ ఓవర్లో అవుట్ చేశాడు హార్దిక్ పాండ్యా. అవుట్ సైడ్ వెళుతున్న బంతిని ఇమామ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి ఎడ్జ్ తీసుకుని వెనక్కు వెళ్లగా వికెట్ కీపర్ రాహుల్ డైవ్ చేస్తూ చక్కటి క్యాచ్ అందుకున్నాడు. కానీ సరిగ్గా బంతి వేసే ముందు పాండ్యా.. ఆ బాల్‌ను రెండు చేతులతో నోటికి దగ్గరగా పెట్టుకుని ఏదో చదివాడు. ఆ వెంటనే వికెట్ దొరకడంతో పాండ్యా బంతిపై ఏదో మంత్రం వేశాడంటూ సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు, మీమ్స్ షేర్ కావడం మొదలైపోయింది.

తాజాగా దీని గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పాండ్యా అసలు సీక్రెట్ బయటపెట్టాడు. 'నేను బంతిపై ఎలాంటి మంత్రం వేయలేదు. అప్పటి వరకు ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంతో నాపై నాకే కోపం వచ్చింది. అందుకే నన్ను నేనే తిట్టుకున్నాను. సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలని నాకు నేనే చెప్పుకున్నా.. అంతే' అని అసలు విషయం వెల్లడించాడు పాండ్యా.
కాగా.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో పాండ్యా 2 వికెట్లు తీసి మెరిశాడు. మొత్తంగా 6 ఓవర్లు వేసిన పాండ్యా.. 34 రన్స్ ఇచ్చి ఇమామ్ ఉల్ హక్‌తో పాటు మహమ్మద్ నవాజ్ వికెట్ కూడా తీసుకున్నాడు.