Hardik Pandya: టీమిండియా ఫ్యాన్స్‌కు భారీ షాక్.. గాయంతో పాండ్యా అవుట్!
న్యూజిల్యాండ్‌తో మ్యాచ్‌కు ముందు భారత్‌కు పెద్ద షాక్ తగిలింది. టీమిండియా వైస్ కెప్టెన్, ఆల్‌రౌండర్ హార్దిక్ ప్యాండ్యా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 9వ ఓవర్ బౌలింగ్ చేస్తుండగా పాండ్యా గాయపడ్డాడు. హార్దిక్ వేసిన బంతిని లిటన్ దాస్ స్ట్రైట్ డ్రైవ్ ఆడగా.. బంతిని హార్దిక్ కాలితో ఆపడానికి ప్రయత్నించాడు. అదే టైంలో బ్యాలెన్స్ మిస్సవ్వడంతో కిందపడిపోయాడు. దీంతో అతడి ఎడమకాలి మడమకు గాయమైంది. ఫిజియోతో పిచ్‌పైనే ట్రీట్‌మెంట్ చేయించుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో మైదానం వదిలి వెళ్లిపోయాడు. ఆ తర్వాత బౌలింగ్ చేయలేదు. బ్యాటింగ్‌కు కూడా రాలేదు.

కొద్ది సేపటికి అతడి గాయంపై టీం అధికారిక ప్రకటన చేసింది. ఆ ప్రకటన ప్రకారం.. పాండ్యాకు స్కానింగ్ తీయించారు. ఆ స్కానింగ్‌లో గాయం కొద్దిగా తీవ్రమైనదిగా కనిపించిదని, దాంతో అతడికి కొంత రెస్ట్ అవసరమని పేర్కొంది. దీంతో న్యూజిల్యాండ్‌తో జరగబోయే మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడో లేదో అని ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది.
అయితే ఇప్పుడు ఫ్యాన్స్ ఆందోళన నిజమైంది. శుక్రవారం పాండ్యా గాయంపై బీసీసీఐ సెక్రటరీ జేషా అఫీషియల్ మెడికల్ రిపోర్ట్ విడుదల చేశారు. దాని ప్రకారం.. 'స్కానింగ్ తర్వాత పాండ్యాకు రెస్ట్ అవసరమని వైద్యులు చెప్పారు. దీంతో అతడిని న్యూజిల్యాండ్‌తో మ్యాచ్‌లో అతడిని ఆడించడం లేదు. ధర్మశాలకు కూడా అతడు రావడం లేదు. నేరుగా ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్ కోసం లక్నో చేరుకుంటాడు. అప్పటివరకు పాండ్యాకు బీసీసీఐ మెడికల్ టీం ట్రీట్‌మెంట్ ఇస్తుంద'ని జేషా పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్.. పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచింది. అలాగే 22వ తేదీన జరగనున్న తమ తదుపరి మ్యాచ్‌లో టాప్‌లో ఉన్న న్యూజిల్యాండ్‌తో ధర్మశాల వేదికగా తలపడబోతోంది. ఆ తర్వాత 29వ తేదీన ఇంగ్లండ్‌తో లక్నో వేదికగా పోటీపడుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications