Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: కెప్టెన్ తర్వాత టీంలో అతనే ముఖ్యం.. ఎవరూ ఊహించని పేరు చెప్పిన భజ్జీ!

ప్రస్తుతం టీమిండియా మిడిలార్డర్ పై పెద్ద చర్చ జరుగుతోంది. కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. ఇలాంటి సమయంలో సూర్యకుమార్ యాదవ్ ను జట్టులోకి తీసుకోవడమే పెద్ద చర్చకు దారి తీసింది. వన్డేల్లో సూర్య చాలా చెత్త ఫామ్ కనబరిచాడు. ఈ క్రమంలో అతన్ని వరల్డ్ కప్ కోసం ఎంపిక చేయడం ఏంటని చాలా మంది నిలదీశారు.

అయితే ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీసులో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు బాదిన సూర్య.. వన్డేలకు పనికిరాడని తనపై ఉన్న ముద్రను చెరిపేసుకున్నాడు. కానీ వరల్డ్ కప్ లో భారత జట్టులో సూర్యకు చోటు దక్కడం ప్రశ్నార్థకంగా మారింది. దాదాపుగా భారత జట్టు లైనప్ అంతా సెట్ అవడంతో సూర్యకు అవకాశం దక్కడం అనుమానమే.

 Suryakumar Yadav

ఈ క్రమంలో తానైతే సూర్యను కచ్చితంగా టీంలోకి తీసుకుంటానని మాజీ దిగ్గజం హర్భజన్ సింగ్ అంటున్నాడు. 'సూర్యకుమార్ యాదవ్ ఎలా ఆడతాడని ఎదురు చూస్తున్నా. తను ఒక ఎక్స్ ఫ్యాక్టర్. జోరు అందుకున్నాడంటే అతన్ని ఆపడం చాలా కష్టం. ఒక్క మ్యాచ్ కాదు. మొత్తం టోర్నమెంట్ గెలిపించగల ప్లేయర్ సూర్య' అని భజ్జీ కితాబిచ్చాడు.

'నేనే సెలెక్టర్ అయితే కెప్టెన్ తర్వాత నేను ఎంపిక చేసే మొదటి ప్లేయర్ సూర్యనే. నేను టీం మేనేజ్మెంట్ లో భాగమైనా కూడా కచ్చితంగా సూర్యను ఆడిస్తా. అయితే అతన్ని ఇప్పుడు ఆడిస్తారో లేదో చెప్పడం కష్టం. అది ఎవరికీ తెలియదు' అని హర్భజన్ చెప్పుకొచ్చాడు. ఆసీస్ తో జరిగిన రెండో వన్డేలో సూర్య తనదైన స్టైల్ లో చెలరేగిన సంగతి తెలిసిందే.

World Cup 2023 Harbhajan wants Team India to play Suryakumar in all matches

అప్పటి నుంచి అతన్ని వరల్డ్ కప్ ఆడించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇదే విషయం చెప్పిన భజ్జీ.. తను కనుక ఇంకా క్రికెట్ ఆడుతుంటే సూర్యకు బౌలింగ్ వేయడానికి భయపడేవాడినని చెప్పుకొచ్చాడు. 'ఇప్పుడైతే సూర్యకు బౌలింగ్ వేయడానికి నేను భయపడతా. అదే నా పీక్ ఫామ్ లో అయితే అంత భయం ఉండదు' అన్నాడు.

సూర్యను చూస్తుంటే తనకు ఏబీ డివిలియర్స్ గుర్తొస్తాడని, అలాంటి ఆటగాడు వరల్డ్ కప్ ఆడాలని అభిప్రాయపడ్డాడు. 'ఒకవేళ సూర్య ఫ్లాప్ అయినా కూడా.. మిగతా అన్ని మ్యాచుల్లో నేను సూర్యను ఆడిస్తా. అతను అంత ముఖ్యం' అని భజ్జీ పేర్కొన్నాడు.

Story first published: Thursday, October 5, 2023, 17:49 [IST]
Other articles published on Oct 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+