Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Harbhajan Singh: సిక్సులు కొట్టడానికే బౌలింగ్ చేస్తున్నారా?.. ఇంగ్లండ్‌పై మండిపడ్డ మాజీ లెజెండ్!

ఇంగ్లండ్ బౌలింగ్‌పై టీమిండియా మాజీ లెజెండ్ మండిపడ్డాడు. ఇంగ్లండ్ ఓటమికి వాళ్ల బౌలింగే కారణమన్నాడు. ఏదో ప్రాక్టీస్ సెషన్‌లో బ్యాట్స్‌మెన్ సిక్స్‌లు కొట్టడానికి వేసే బౌలింగ్‌లా ఉందంటూ విమర్శించాడు.

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఏకంగా 229 పరుగుల భారీ తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమికి ఆ జట్టు బౌలింగే కారణమన్నాడు హర్భజన్ సింగ్.

World Cup 2023 Harbhajan slams England bowling for not attacking

'ఇంగ్లీష్ బౌలర్ల బౌలింగ్ నాకస్సలు అర్థం కాలేదు. అటు యార్కర్లూ వేయలేదు.. ఇటు షార్ట్ పిచ్ బంతులూ వేయలేదు. ఆ బంతులను ఎదుర్కోవడానికి సౌతాఫ్రికా బ్యాటర్లు అస్సలు ఇబ్బంది పడలేదు. ఇంగ్లాండ్ బౌలింగ్ చూస్తే ఏదో మేం ప్రాక్టీస్‌ సెషన్స్‌లో బ్యాటర్లు సిక్స్‌లు ప్రాక్టీస్ చేసుకోవడానికి బంతులేసినట్లుంది. ఇంతకంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి బౌలింగ్ అటాక్ కనిపిస్తుందం'టూ తీవ్ర విహర్శలు చేశాడు.

పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉందని, ఏ మాత్రం బంతి లైన్ అండ్ లెంగ్త్ మిస్ అయినా బంతి బౌండరీ చేరేలా ఉందన్న హర్బజన్.. ఆ విషయాన్ని ఇంగ్లీష్ బౌలర్లు ఏ మాత్రం పట్టించుకోలేదన్నాడు. కనీసం బంతిని వికెట్లకు దూరంగా విసరడానికి కూడా ప్రయత్నించలేదని, అందుకే సౌతాఫ్రికా బ్యాటర్లు సునాయాసంగా బౌండరీల వర్షం కురిపించారన్నాడు. ఇప్పటికైనా ఇంగ్లండ్ జట్టు తమ బౌలింగ్‌పై ఫోకస్ పెట్టకపోతే టోర్నీలో నిలబడడం కష్టమేనని హర్బజన్ సలహా ఇచ్చాడు.

ఇక సౌతాఫ్రికా బ్యాటింగ్‌పై హర్బజన్ ప్రశంసల వర్షం కురిపించాడు. సౌతాఫ్రికా అద్భుతంగా బ్యాటింగ్ చేసిందన్నాడు. వాళ్లని ఎంత పొగిడినా తక్కువేనని, వాళ్ల బ్యాటింగ్‌ని ప్రశంసించడానికి మాటలు కరువవుతాయన్నాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో చివరి 15, 20 ఓవర్లు చూస్తే ఇంగ్లీష్ బౌలర్లకు బంతి వేయడం, బౌండరీలు బాదించుకోవడం తప్ప మరో ఆప్షన్ లేనట్లు కనిపించిందని చెప్పాడు.

ముఖ్యంగా క్లాసెన్‌ సిక్స‌ులు బాదడం చూస్తే ముచ్చటేసింన్నాడు. ఫోర్లు, సిక్స్‌లు ఎటు కావాలంటే అటు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇష్టం వచ్చినట్లు బాదాడని హర్భజన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచులో క్లాసెన్ సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే.

Story first published: Sunday, October 22, 2023, 16:08 [IST]
Other articles published on Oct 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+