Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsBAN: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఆ డేంజర్ లేదుగా..!

ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్: భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఇది బంగ్లా జట్టుకు నష్టం కలిగించేదే కానీ.. భారత్‌కు మాత్రం పెద్ద గుడ్ న్యూస్. ఈ విషయం తెలియగానే ఫ్యాన్స్ కూడా ఇక ఇండియాని ఆపడం బంగ్లా వల్ల కాదని, రోహిత్ సేన ఇక చెలరేగడం ఖాయమని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

వరల్డ్ కప్‌‌లో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి మంచి ఊపు మీదున్న టీమిండియా ఇప్పుడు బంగ్లాదేశ్‌ను ఢీకొట్టబోతోంది. మరోవైపు టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచిన బంగ్లా.. ఈ మ్యాచ్‌లో భారత్‌కు షాకివ్వాలని చూస్తోంది. అయితే షకిబ్ అల్ హసన్ రూపంలో ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది. న్యూజిల్యాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన షకిబ్.. ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని టాస్ సమయంలో బంగ్లా తాత్కాలిక కెప్టెన్ షాంటో వెల్లడించాడు. షకిబ్ గౌర్హాజరీలో నజ్ముల్ హుస్సేన్ షాంటో ఈ మ్యాచ్‌లో బంగ్లా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించబోతున్నాడు.

 World Cup 2023 Good news for team india while playing Bangladesh

ఇక టాస్ విషయానికొస్తే బంగ్లా కెప్టెన్ షాంటో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వికెట్ ఫ్రెష్‌గా ఉందని, వాతావరణం కూడా బ్యాటింగ్‌కు అనుకూలించేలా ఉండడం వల్ల తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయగలిగితే భారత్‌పై కచ్చితంగా పై చేయి సాధించగలమన్నాడు. ఇక షకిబ్ స్థానంలో నసుమ్ అహ్మద్‌‌ను జట్టులోకి తీసుకున్నామన్నాడు. అలాగే టస్కిన్ అహ్మద్ స్థానంలో హసుమ్ మహ్మూద్‌ను తీసుకున్నామన్నాడు.

అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ మాత్రం బౌలింగ్‌ రావడం ఆనందంగానే ఉందన్నాడు. తాను టాస్ గెలిచున్నా బౌలింగే ఎంచుకునేవాడినన్నాడు. తమ జట్టుకు ఛేజింగ్ కలిసొస్తోందని, అందుకే బౌలింగ్ చేయడమే బెటర్ అన్నాడు. ప్రస్తుతానికి మ్యాచ్‌లో గెలవడంపైనే ఫోకస్ పెట్టామన్నారు. అలాగే జట్టులో ఎలాంటి మార్పులూ చేయలేదని వెల్లడించాడు.

బంగ్లాదేశ్ జట్టు:
లిటాన్ దాస్, తంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ షాంటో (కెప్టెన్), మెహిదీ హసన్ మిరాజ్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, నసుమ్ అహ్మద్, హసన్ మహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షోరీఫుల్ ఇస్లాం

ఇండియా జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

Story first published: Thursday, October 19, 2023, 14:17 [IST]
Other articles published on Oct 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+