Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Gautam Gambhir: వాళ్లిద్దరూ చెలరేగారు.. అందుకే ఇంత ఈజీగా గెలిచాం!

వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాపై నలువైపుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా న్యూజిల్యాండ్, ఇంగ్లండ్ రూపంలో రెండు బలమైన జట్లను ఎదుర్కొన్న భారత్ అద్భుతమైన విజయాలు నమోదు చేసింది. హార్దిక్ పాండ్యా వంటి కీలక ప్లేయర్ దూరమైనా కూడా భారత్ చెలరేగింది.

ముఖ్యంగా ఈ రెండు మ్యాచుల్లో భారత బౌలింగ్ ఎటాక్ అదరగొట్టింది. మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా ఇద్దరూ చెలరేగారు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో అయితే కేవలం 230 పరుగుల టార్గెట్‌ను కూడా చక్కగా కాపాడుకున్నారు. ఈ క్రమంలో షమీ నాలుగు వికెట్లతో చెలరేగగా.. బుమ్రా మూడు వికెట్లతో అదరగొట్టాడు.

World Cup 2023 Gautam Gambhir credits these two for easy victory against England

ఇదే విషయంపై భారత మాజీ లెజెండ్ గౌతమ్ గంభీర్ కూడా స్పందించాడు. ఈ ఇద్దరు పేసర్ల బౌలింగ్‌ను తెగ మెచ్చుకున్నాడు. ఇలా రెండు ఎండ్‌ల నుంచి అద్భుతమైన బౌలింగ్‌ను చాలా కాలం తర్వాత చూస్తున్నానని చెప్పాడు. 'సాధారణంగా ఒక టీంలో ఒక పేసర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తుంటే.. అతనికి అవతలి ఎండ్ నుంచి అంత సహకారం దొరకదు' అని గంభీర్ అన్నాడు.

'రెండో వైపు అంత సహకారం లేకపోవడంతో ఆ పేసర్ ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. కానీ ఇది మాత్రం భారత్ నుంచి వరల్డ్ క్లాస్ బౌలింగ్. ఇంగ్లండ్ వంటి ఎటాకింగ్ బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కోవడం మాటలు కాదు. బుమ్రా కన్నా షమీ ఎక్కువ వికెట్లు తీసి ఉండొచ్చు. కానీ నా వరకు వాళ్లిద్దరూ ఈ మ్యాచులో రెచ్చిపోయారంతే' అన్నాడు.

ఇదే విషయంపై మాజీ పేసర్ శ్రీశాంత్ కూడా మాట్లాడాడు. ఈ మ్యాచులో గొప్పగా రాణించిన ప్లేయర్ మహమ్మద్ షమీనే అన్నాడు. 'గంభీర్ ఉన్నాడు కాబట్టి.. షమీ ఐదు వికెట్లు తీసుకుంటే బాగుండేదని అనను. కానీ తన మ్యాచ్ విన్నింగ్ నాలుగు వికెట్ల ప్రదర్శన మాత్రం సూపర్ అనే చెప్తాను' అని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, October 31, 2023, 16:59 [IST]
Other articles published on Oct 31, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+