Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Gautam Gambhir: ఆ ఒక్కడి వల్లనే ఇంగ్లండ్ ఇంత చెత్తగా ఆడుతోంది: గౌతమ్ గంభీర్

World Cup 2023: ఈ వరల్డ్ కప్‌లో పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెతకు అద్దం పడుతున్న జట్టు ఇంగ్లండ్. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలో దిగిన ఇంగ్లండ్ అత్యంత దారుణమైన ప్రదర్శన చేస్తోంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచులు ఆడిన ఈ జట్టు కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. ఈ విజయంతో గాడిన పడిందని ఫ్యాన్స్ అనుకున్నారు.

కానీ తమ పద్ధతి మారలేదని ఇంగ్లండ్ నిరూపించుకుంది. శ్రీలంక చేతిలో దారుణంగా ఓడి, భారత్‌ను ఢీకొట్టేందుకు లక్నో చేరుకుంది. ఈ మ్యాచులో భారత్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసినా కూడా.. మరోసారి ఇంగ్లండ్ బ్యాటర్లు దారుణంగా ఫెయిలయ్యారు. దీంతో ఆ జట్టు ఏకంగా 100 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.

World Cup 2023 Gautam Gambhir blames key player for England woes

ఈ క్రమంలో ఇంగ్లండ్ స్టార్ జో రూట్ వల్లనే ఆ టీం ఇలా ఫెయిలవుతోందని టీమిండియా లెజెండ్ గౌతం గంభీర్ అన్నాడు. దీనికి తన వద్ద సరైన కారణం కూడా ఉందన్నాడు. 'ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను ఒకసారి చూడండి. అందరూ చాలా ఎగ్రెసివ్‌గా ఆడేవాళ్లే. కానీ రూట్ అలాంటి ప్లేయర్ కాదు. అందుకే అతని ఫామ్ వల్లనే ఇంగ్లండ్ ఓడిపోతుందని అంటున్నా' అని గంభీర్ వివరించాడు.

'రూట్ ఫామ్‌లో లేకపోవడం ఆ జట్టు బ్యాటింగ్ లైనప్‌ను ఇబ్బంది పెడుతోంది. ఆ టీంలో రూట్ యాంకర్ రోల్ పోషించాల్సిన ప్లేయర్. అతని చుట్టూ మిగతా వాళ్లు ఎగ్రెసివ్‌గా ఆడుకుంటారు. వాళ్లకు ఆ స్వేచ్ఛ రావాలంటే రూట్ ఆడాలి. అతను ఆడకపోతే మిగతా వాళ్లంతా తేలిపోతారు. సీమర్, స్వింగింగ్ డెలివరీలను ఎదుర్కొంటూ ఒత్తిడిని తట్టుకోవడం అందరి వల్లా కాదు' అని గంభీర్ చెప్పాడు.

ఈ వరల్డ్ కప్‌ను రూట్ చక్కగానే ఆరంభించాడు. బంగ్లాదేశ్, న్యూజిల్యాండ్‌పై హాఫ్ సెంచరీలు బాదాడు. కానీ ఆ తర్వాత సడెన్‌గా అతని ఫామ్ పూర్తిగా పోయింది. మొత్తం ఆరు మ్యాచుల్లో 175 పరుగులు మాత్రమే చేశాడు. ఇక భారత్‌పై అయితే తను ఎదుర్కొన్న తొలి బంతికే అవుటయ్యాడు.

Story first published: Monday, October 30, 2023, 17:56 [IST]
Other articles published on Oct 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+