Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsPAK: పాకిస్తాన్‌కు అంత సీన్ లేదు.. ఆసీస్‌తో మ్యాచులే బాగుంటాయి: గంగూలీ

సిరీస్ ఏదైనా, టోర్నీ ఏదైనా సరే.. ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే వచ్చే మజానే వేరు. ఒక విధంగా ప్రపంచం అంతా అలా ఆగిపోయి చూస్తుంది. ఈ రెండు జట్లు తలపడే మ్యాచులకు వచ్చే వ్యూయర్‌షిప్ కూడా అలాగే ఉంటుంది. స్టేడయాలు ఫుల్ అయిపోతాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఉండే అంత హైప్.. అసలు మ్యాచ్‌లో ఉండదని టీమిండియా లెజెండ్ గంగూలీ అంటున్నాడు.

వచ్చే వన్డే వరల్డ్ కప్, ఆసియా కప్‌లలో కూడా ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచులపై చాలా హైప్ ఉంది. వరల్డ్ కప్‌లో ఈ రెండు టీమ్స్ తలపడే అహ్మదాబాద్‌లో ఇప్పటికే హోటల్ ధరలకు భారీగా పెరిగిపోయాయి. ఆ మ్యాచ్ టికెట్లు కూడా ఎక్కువ సేపు ఉండవు. కానీ ఈ మ్యాచ్‌లు చాలా ఏకపక్షంగా జరిగిపోతాయని, పాక్‌ను భారత్ పూర్తిగా డామినేట్ చేయడం పరిపాటేనని గంగూలీ వివరించాడు.

Sourav Ganguly

వరల్డ్ కప్ మ్యాచుల్లో పాక్ చేతిలో భారత్ దాదాపు ఓడిపోలేదు. దుబాయ్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్‌లోనే తొలిసారి భారత్ ఓడింది. వన్డేల్లో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ ఓడింది. అప్పటి వరకు ఐసీసీ టోర్నీల్లో పాక్ చేతిలో భారత్‌కు ఓటమి లేదు. ఇక వన్డే వరల్డ్ కప్‌లలో ఈ రెండు జట్లు తలపడిన ప్రతిసారీ విజయం భారత్‌నే వరించింది. అయితే గణాంకాలు చూస్తే గంగూలీ మరీ ధీమాగా ఉన్నాడని అనిపిస్తుంది.

ఇటీవలి కాలంలో పాక్, భారత్ నాలుగు టీ20లు ఆడగా.. వీటిలో రెండు గెలిచిన టీమిండియా, రెండు ఓడింది. అయితే కీలకమైన మ్యాచుల్లో పాక్ గెలవడం గమనార్హం. భారత్ గెలిచిన రెండు మ్యాచులూ పెద్ద ప్రాధాన్యం లేనివే. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ వీరోచిత పోరాటంతో భారత్ గెలిచినా కూడా.. పాకిస్తాన్ ఆ టోర్నీ ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. అంటే ఆ ఓటమి ప్రభావం పాక్‌పై లేదనే చెప్పాలి.

'2021 టీ20 వరల్డ్ కప్‌లో భారత్ సరిగా ఆడలేదు. కానీ నన్నడిగితే వరల్డ్ కప్‌లలో భారత్, పాక్ మ్యాచుల కన్నా ఆస్ట్రేలియాతో ఆడే మ్యాచుల క్వాలిటీ బాగుంటుంది' అని గంగూలీ తెలిపాడు. వన్డే వరల్డ్ కప్ లెక్కలు చూస్తే మాత్రం గంగూలీ ధీమా కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే గత ఏడు వన్డే వరల్డ్ కప్‌లలో భారత్, పాక్ ఎప్పుడు ఆడినా విజయం టీమిండియాదే. ఈ మ్యాచులన్నీ కూడా ఏకపక్షంగా సాగడం గమనార్హం.

2010 నుంచి చూసుకుంటే.. వన్డేల్లో మనం పది మ్యాచులు గెలిస్తే, పాక్ మనపై కేవలం నాలుగు మ్యాచులే గెలిచింది. అయితే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌ను పాక్ చిత్తు చేసిన విషయం మర్చిపోకూడదు. కాబట్టి భారత జట్టు మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించకుండా.. మనసు పెట్టి ఆడితే ఈ మ్యాచ్‌లో కూడా భారత విజయం ఖాయమే.

Story first published: Monday, July 3, 2023, 19:15 [IST]
Other articles published on Jul 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+